పుష్ప సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా బ్రేక్ దొరకగానే వెంకటేష్ కలుసుకున్నారు. వెంకటేష్-వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. తాజాగా ఎఫ్ 3 షూటింగ్ జరుగుతున్న సమయంలో బన్నీ ఆకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. వెంకటేష్, వరుణ్ తేజ్‌తోపాటు.. చిత్రయూనిట్‌తో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ ఎఫ్3లో గెస్ట్ రోల్ ఏమైనా చేస్తున్నారా? ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏదైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఇద్దరు కలిసి నటించాలని వాళ్ల అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇద్దరి కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇప్పటికే వెంకటేష్.. మహేష్‌బాబు, రామ్, పవన్‌కళ్యాణ్, వరణ్‌తేజ్, నాగచైతన్యతో మల్టీస్టారర్‌లో నటించారు. త్వరలో అన్న కొడుకు రానాతో కలిసి ఒక వెబ్ సిరీస్ కూడా చేయనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను ఈ మధ్య విడుదల కూడా చేశారు. చూడాలి మరీ అల్లు అర్జున్- వెంకటేష్ కలిసి నటిస్తారో? లేదో? వారిద్దరి మల్టీస్టారర్ మూవీకి ఎవరు డైరెక్టర్ అయితే బాగుంటుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బయటపడ్డ మహేశ్ బాబు ఆస్తుల లెక్కలు.. షాకైన టాలీవుడ్ వర్గాలు..