ఐకాన్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాషన్ సెన్స్ గురించి అందరికి తెలుసు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గెటప్‌లతో.. స్టైలీష్ లుక్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. పుష్ప చిత్రం తర్వాత బన్నీకి ఇండియా వైడ్‌గా అభిమానులు మొదలయ్యారు. పుష్ప-2 మూవీ కోసం ఇండియా వైడ్‌గా ఉన్న ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ గ్యాప్‌లో బన్నీ కుటుంబంతో కలిసి వెకేషన్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. పనిలో పనిగా యాడ్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు బన్నీ. ఇటీవల త్రివిక్రమ్‌తో యాడ్ కంప్లీట్ చేసిన అల్లు అర్జున్.. తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్లో సరికొత్త యాడ్‌లో యాక్ట్ చేశాడు.
ఈ యాడ్ షూట్లో పాల్గొన్న స్టైలిష్ స్టార్.. తన నయా లుక్‌కి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పూర్తిగా ఊర మాస్ లుక్‌లో ఉన్న బన్నీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బన్నీ లుక్ కంప్లీట్‌గా ఛేంజ్ కావడంతో ఫ్యాన్స్ పునకాలతో ఊగిపోతున్నారు. జస్ట్ ఫొటో లుక్కే ఇంతలా ఉంటే.. ఇక ఫుల్ యాడ్ వస్తే ఇక ఏ రేంజ్లో ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ యాడ్ షూట్లో బన్నీ లుక్ వేరే లెవెల్లో ఉండబోతుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. చెవిపోగు, చేతిలో సిగార్, లైట్‌గా జుట్టు నెరుస్తున్నట్లు వైట్ కలరింగ్ ఇచ్చిన బన్నీ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ అల్లు అర్జున్ క్యాప్షన్ ఇచ్చి.. ఈ ఫొటోను షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఈ హీరో ‘పుష్ప’ పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. అలానే అనసూయ, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబర్లో లేదంటే వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి బన్నీ మాస్ లుక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంలో తెలియజేయండి.
— Allu Arjun (@alluarjun) July 29, 2022