చిత్ర పరిశ్రమలో అభిమాన సినీతారలకు సంబంధించి ఏ విషయమైనా అభిమానులకు ఆనందాన్నే కలిగిస్తుంది. అందుకే అభిమాన తారలు ఎలాంటి మంచి పని చేపట్టినా, ఎన్ని సినిమాలు చేసినా ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలుస్తూనే ఉంటారు. అయితే.. సినిమాల వరకు ఓకే.. కానీ, ఫేవరేట్ స్టార్స్ పర్సనల్ విషయాలు కూడా ఫ్యాన్స్ కి ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెళ్లికి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చిరంజీవికి, ఆయన సతీమణి సురేఖతో పెళ్లి ఎలా జరిగింది? పెళ్లి చూపులు ఎక్కడ జరిగాయి? ఈ విషయాలపై స్వయంగా సురేఖ గారి సోదరుడు, నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడంటే సినిమావాళ్ళకు అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కానీ.. అప్పట్లో సినిమా వాళ్లకు అమ్మాయిని ఇవ్వడం అనేది పెద్ద ప్రశ్న. మా నాన్నగారు అల్లు రామలింగయ్యగారికి.. డివిఎస్ రాజు గారిపై గురుభావం ఉండేది. ఆయన దగ్గరికెళ్లి చిరంజీవి గురించి మాట్లాడటానికి వెళ్ళాం.
మా నాన్నగారు మాట్లాడుతూ.. ‘మీకు చిరంజీవి తెలుసు కదా.. ఆయన గురించి కనుకున్నాం. చాలా మంచివాడని, ఏ దురలవాట్లు లేవని తెలుసుకున్నాం. కానీ.. మనమ్మాయిని ఓ ఫిలిం యాక్టర్ కి ఇవ్వాలా? అనే సందేహంతో వచ్చామని డివిఎస్ రాజు గారితో అన్నారు. ఆ వెంటనే రాజు గారు స్పందిస్తూ.. మీరూ, మీ అబ్బాయి సినిమావాళ్లు కాదా? అసలు మనం అలా ఆలోచించకూడదు. మీకు అబ్బాయి నచ్చాడు.. దురలవాట్లు లేవు.. మనం అమ్మాయిని ఇవ్వాలని మా నాన్నగారికి హితబోధ చేశారు.
ఆ తర్వాత నేను, జయకృష్ణ, హరిబాబు కలిసి సంబంధం అడగడానికి నెల్లూరులో చిరంజీవి గారింటికి వెళ్ళాం. అలా జరిగింది. అయితే.. అప్పటికీ చిరంజీవి గారు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదట. ఓ మూడేళ్ళ తర్వాత చేసుకుందాం అనుకున్నారట. ఈ విషయాన్ని పెళ్లి తర్వాత సరదాగా చెబుతుండేవారు. మ్యారేజ్ అయ్యాక ఓ ఏడాదిన్నర పాటు మా ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్ మొదలై క్లోజ్ అయ్యాం.” అంటూ నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు అల్లు అరవింద్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.