మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ కాంబినేషన్ లో.. మాస్ మహారాజా రవితేజ మరో ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్న “వాల్తేరు వీరయ్య” మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వాల్తేరు […]
మనిషి జీవితంలో.. ఒడిదుడుకులు చాలా సహజం. జీవితంలో అత్యున్నత శిఖరాలను చవి చూస్తాం.. అంతులేని కష్టాలను అనుభవిస్తాం. అయితే కష్టసుఖాలు ఏవైనా సరే.. ఎల్లకాలం ఉండవు. నీటి ప్రవాహం లాగా ప్రవహిస్తూనే ఉంటాయి. ఎవరి జీవితంలోనైనా ఈ పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. సామాన్యుల విషయంలో ఇలాంటి సంఘటనలు వస్తే.. పెద్దగా పట్టించుకోం.. కానీ సెలబ్రిటీల జీవితాల్లో మాత్రం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే.. అది వార్త అవుతుంది. ఇక నటీనటుల జీవితాల్లో ఒడిదుడుకులు చాలా సహజం. కొన్నాళ్ల […]
తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం.. సవాళ్లకు ఎదురెళ్లి ఢీకొనే నైజం.. మూస ధోరణికి చరమగీతం పాడే ఆలోచనలు ఆయన సొంతం.. ఆయనే ఘట్టమనేని కృష్ణ. కౌబాయ్ గా, గూఢాచారిగా, అల్లూరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పటి వరకు మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినీ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించి.. ప్రపంచానికి చాటి చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. గుండె నొప్పితో ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ […]
మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’తో హిట్ కొట్టిన ఆయన.. ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ కి గ్యాప్ లేకుండా అటెండ్ అవుతున్నారు. ఈ సినిమాలో మాసీ అవతార్ లో కనిపించనున్నారు. అందుకు సంబంధించిన టైటిల్ టీజర్ ని ఈ మధ్యే రిలీజ్ చేయగా.. అది అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. చిరుని ఇలా చూసి చాలా రోజులైందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంచనాలు అమాంతం పెంచేసుకుంటున్నారు. సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లిపోవడం […]
తెలుగులో 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన పావలా శ్యామల.. దిక్కులేని ఆమెలా బతుకునీడుస్తుంది. అనారోగ్యం పాలై అనాథాశ్రమంలో కూతురితో కలిసి జీవిస్తోంది. ఎప్పటి నుంచో ఈమె ఆరోగ్యం సరిగా లేదు. ఆ మధ్య మా అసోసియేషన్ లో మెంబర్ షిప్ లేకపోతే చిరంజీవి లక్ష రూపాయలు కట్టి మరీ మెంబర్ షిప్ ఇప్పించారని, ఆమె కుమార్తె ఆరోగ్యం పాడైతే మరో 2 లక్షలు ఇచ్చి ఆర్థిక సాయం చేశారని పావలా శ్యామల వెల్లడించింది. ఆ డబ్బులతోనే […]
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మేనియా. చిరు చేసిన గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దీంతో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని బరిలోకి దిగిన మెగాస్టార్.. తను అనుకున్నది సాధించారు. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా, రూ. 69.12 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దీంతో మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాక్ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం […]
మెగాస్టార్ చిరంజీవి.. మెగా కమ్ బ్యాక్ ఇచ్చేశారు. ‘గాడ్ ఫాదర్’తో థియేటర్స్ అన్నీ షేక్ చేసి పడేస్తున్నారు. తొలిరోజే వరల్డ్ వైడ్ రూ.38 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి చాలా సులభంగా రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుంది. ఇక సినిమాలో చిరుతో పాటు సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ తదితరులు.. తమ నటనతో మెప్పించి, ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు. సినిమా రిలీజ్ కంటే ముందు ప్రమోషన్స్ గట్టిగా చేశారు. […]
వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ పై సినిమాలతో పాటు బుల్లితెరపై షోలో కూడా సందడి చేస్తున్నారు కొందరు స్టార్ హీరోలు. ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున లాంటి హీరోలు సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా వివిధ కార్యక్రమాలను హోస్ట్ చేసి అలరించారు. అయితే.. గతేడాది ఫస్ట్ టైం ఓ సెలబ్రిటీ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరించి.. మొదటి సీజన్ లోనే స్టార్ హోస్ట్ గా పేరొందారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆయన […]
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఎనర్జీ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది అఖండ సినిమాతో ‘ఆల్ టైం బ్లాక్ బస్టర్’ని ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఈ ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. బాలయ్య సినిమా అంటేనే మాస్ ఆడియెన్స్ లో పూనకాలు పుట్టేస్తాయి. అంతలా మాస్ లో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు. అయితే.. బాలయ్య డైలాగ్స్, డాన్స్ తో పండగ చేసుకునే ఫ్యాన్స్ ని.. సినిమాలలోనే కాకుండా డిజిటల్ […]
ఆమెని చూస్తే అచ్చతెలుగమ్మాయిలా ఉంటుంది. కానీ మలయాళీ. తండ్రి ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్. తల్లి కూడా హీరోయిన్ గా చేసింది. తెలుగులోనూ చిరంజీవితో ‘పున్నమినాగు’ సినిమాలో నటించింది. తెలుగులో పెద్ద అవకాశాలు రాకపోవడం వల్ల దక్షిణాదిలో వేరే భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ చిన్నారి.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా చిత్రాలు చేస్తూ అలరిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘నేను శైలజ’ సినిమాతో […]