సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాని నటీనటులు ఉన్నారు. కానీ ఒకే ఒక్క సినిమాతో ఒవర్ నైట్ లో స్టార్ డమ్ సంపాదించినవారు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో నటన మాత్రమే కాదు.. అదృష్టం కూడా కలసిరావాలని అంటుంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇతర భాషకు సంబంధించిన హీరోయిన్లు ఎంతోమంది తమ టాలెంట్ తో స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోయారు. అందం, అభినయం ఉన్నప్పటికీ గ్లామర్ షో చేసినప్పటికీ కొంతమంది హీరోయిన్లు మాత్రం సరైన సక్సెస్ లేక కనుమరుగైపోతున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్ల హవా నడుస్తుంది. మొన్నటి వరకు సమంత, కాజల్, రకూల్ ప్రీత్ సింగ్, తమన్నా, రష్మిక లాంటి హీరోయిన్లు బాలీవుడ్ పయణం కావడంతో తెలుగు లో కొత్తగా వస్తున్న హీరోయిన్లు హవా చాటుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే టాక్ నడుస్తుంది. ఈ మూవీలో వైష్ణవి పాత్రలో నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రిలీజ్ అయిన రెండు మూడు రోజులు కాస్త విమర్శలు వచ్చినప్పటికీ.. సినిమా పరంగా వైష్ణవి చైతన్య నటన అద్భుతం అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోతుందని అందరూ అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా బేబీ మూవీలో నటించిన వైష్ణవి చైతన్య పేరే వినిపిస్తుంది. బేబీ మూవీలో చాలెంజింగ్ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఈ మూవీలో వైష్ణవి నటన చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీ ఇంత సక్సెస్ అయ్యిందంటే.. కేవలం వైష్ణవి వల్లే అంటున్నారు. ఆమెలో గొప్ప నటి దాగి ఉందని.. భవిష్యత్ లో తెలుగు ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకుంటుందని అంటున్నారు. బేబీ మూవీ 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించి బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. దీంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతల చూపు వైష్ణవి చైతన్యపై పడిందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన తదుపరి చిత్రంలో వైష్ణవిని తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ కి వెళ్లడంతో అప్ కమింగ్ హీరోయిన్లకు మంచి ఛాన్సులు వచ్చాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కించిన ‘పెళ్లిసందD’ మూవీతో హీరోయిన్ పరిచయం అయ్యింది శ్రీలీల. ఈ సినిమాల తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్లు రావడం.. అవి కూడా మంచి సక్సెస్ సాధించడంతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాత్ భగత్ సింగ్’, బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’, మహేష్ బాబు తో ‘గుంటూరు కారం’, రామ్ తో ‘స్కంద’, నితిన్ తో ‘ఎక్స్ట్రా’, వైష్ణవ్ తేజ్ తో ‘ఆది కేశవ’ లాంటి పెద్ద సినిమాల్లో నటిస్తుంది. అంతేకాదు ఈ మద్యనే విజయ్ దేవరకొండ తో మరో పాన్ ఇండియా మూవీ చేయడానికి ఒప్పుకుందని ఇండస్ట్రీ టాక్. ఈ మూవీస్ హిట్ అయితే కొంతకాలం ఇండస్ట్రీని ఏలేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే బేబీ మూవీతో భారీ కలెక్షన్లు రాబట్టి బెస్ట్ హీరోయిన్ అనిపించుకున్న వైష్ణవి చైతన్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం శ్రీలీలను సైతం బీట్ చేసే రేంజ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది వైష్ణవి. ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో దాదాపు 6 సినిమాలు ఉన్నాయని సమాచారం. ఈ సినిమాలకు సంబంధించిన అఫిషియల్ టాక్ త్వరలో రాబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీస్ లో ముందుగా శ్రీలీల అనుకున్నప్పటికీ ఇప్పుడు వైష్ణవి చైతన్యను ఒకే చేసిన సినిమాలు కూడా ఉన్నాయని సమాచారం. వైష్ణవి కరోనా సమయంలో టిక్ టాక్ వీడియోలు, సాంగ్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది ఈ హైదరాబాదీ నటి. ‘అలా వైకుంఠపురం లో’ మూవీలో అల్లు అర్జున్ చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది వైష్ణవి. ఇక బేబీ మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించిన వైష్ణవి మొత్తానికి శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తూ చుక్కలు చూపిస్తుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.