‘ఆదిపురుష్’ మూవీ ఇంకా థియేటర్లలోకి రానే లేదు. కానీ అప్పుడే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రభాస్ మూవీకి ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయింది.
కొన్నాళ్లుగా బోసిపోయిన ఇండియన్ బాక్సాఫీస్‌కు మళ్లీ కళ తెచ్చేందుకు సిద్ధమవుతోంది ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శక నిర్మాత ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీరాముడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కనిపించనున్నారు. రాముడి గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేయాలనే సంకల్పంతో తీసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరికి చూపించాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన వరల్డ్ వైడ్‌గా మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది ‘ఆదిపురుష్’. తెలుగుతో పాటు హిందీ, తమిళ బాక్సాఫీస్ వద్ద కూడా పెద్ద రిలీజ్లు లేకపోవడంతో ప్రభాస్ మూవీ కలెక్షన్లకు ఢోకా ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. బాగుందనే టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద జాతర నడుస్తుందనే చెప్పొచ్చు. ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
‘ఆదిపురుష్’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. నార్త్‌లో బుకింగ్స్ రిలీజ్ చేసిన చాలా చోట్ల తక్కువ టైమ్‌లోనే టికెట్స్ అయిపోవడాన్ని బట్టి సినిమాపై ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై ఆసక్తి ఏర్పడింది. విజువల్ వండర్లా రూపొందిన ‘ఆదిపురుష్’ ఓటీటీ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడిందట. అయితే ఈ పరిస్థితుల్లో అత్యధిక ధర చెల్లించి మరీ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. ఇక, ‘ఆదిపురుష్’ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం మూవీ రిలీజైన 8 వారాల తర్వాతే ఉంటుందని సమాచారం. ఈ మేరకు నిర్మాతలు అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం చేసుకున్నారట. ఈ లెక్కన జూన్ 16న రిలీజ్ అవుతున్న ప్రభాస్ మూవీ.. ఆగస్టు 15వ తేదీకి కాస్త అటు ఇటుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఒక టాక్ వినిపిస్తోంది.
#Adipurush will premiere on OTT platform only after 8 weeks of its theatrical release. The makers say the film is made for theatrical experience. #AdipurushOnJune16th #Prabhas pic.twitter.com/0yDBVg7eeK
— BA Raju’s Team (@baraju_SuperHit) June 13, 2023