టాలీవుడ్ క్రేజియెస్ట్ కపుల్ గా పేరు సంపాదించిన నరేష్, పవిత్రల జంట పెళ్లి చేసుకుని సెన్సేషన్ సృష్టించిందీ. తాము పెళ్లి చేసుకున్నట్లు నరేష్ ట్విట్టర్ లో చెప్పడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో వివాదాస్పద జంటగా మారిన నరేష్, పవిత్రలు పెళ్లి వార్తతో అందరికి షాక్‌నిచ్చారు. వివాహం చేసుకుని ఏడడుగుల బంధంలో ఏకమైన ఈ జంట.. ఇప్పుడు హనీమూన్‌కు కూడా చెక్కేసింది. దుబాయ్‌లో వీరిద్దరూ విహరిస్తున్న వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాము పెళ్లి చేసుకున్నట్లు నరేష్ ట్విట్టర్ ద్వారా రివీల్ చేశారు. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు, మీ #PavitraNaresh’ అంటూ నరేష్ ట్వీట్ చేశారు. మా ఈ కొత్త ప్రయాణంలో జీవిత కాలం పాటు శాంతి, ఆనందం కోసం మీ దీవెనలు కావాలంటూ నరేష్ కోరారు. అత్యంత సన్నిహితులు, కొద్ది మంది బంధువుల మధ్య ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, నటుడు నరేష్‌కు ఇది నాల్గవ వివాహం కాగా, సహాయ నటి పవిత్ర లోకేష్‌కు ఇది రెండవ వివాహం. సినిమా షూటింగ్స్ సమయాల్లో ప్రేమలో పడ్డ ఈ జంట నాలుగేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘపతి వీరి మధ్య ఉన్న బంధాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో వీరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయి. తనకు విడాకులు ఇవ్వకుండా వేరో పెళ్లికి ఒప్పుకునేది లేదని రమ్య చెబుతున్నారు. ఈ కేసులు కోర్టులో ఉండగానే ఇప్పుడు ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు నరేష్, పవిత్రల జంట. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఓ సెన్సేషనల్ వీడియోను నరేష్ విడుదల చేసిన సంగతి విదితమే. ‘న్యూ ఇయర్, కొత్త ప్రయాణం ప్రారంభం, మీ దీవెనలు కావాలి’ అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు.
అందులో ఒకరికొకరు కేక్ తినిపించుకున్న నరేష్, పవిత్రలు, తమ మధ్య ఉన్న రిలేషన్‌ను చెప్పకనే చెప్పారు. హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూనే త్వరలో పెళ్లి చేసుకుంటున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వీడియోను పోస్టు చేసి సెన్సేషన్ సృష్టించారు. అయితే ఇది సినిమా ప్రమోషనా లేదా నిజంగా వీరు పెళ్లి చేసుకున్నారా అనే కన్య్ఫూజన్‌లో ఉండగానే.. వీరిద్దరూ దుబాయ్‌లో దర్శనమిచ్చారు. దీంతో హనీమూన్‌కు వెళ్లారన్న వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట్లో దర్శనమివ్వడంతో నిజంగానే వీరు పెళ్లి చేసుకున్నటు ప్రేక్షకులు భావిస్తున్నారు. దుబాయ్ ఎడారుల్లో, పలు ప్రదేశాలను సందర్శించిన ఫోటోలు, వీడియోలు వార్తా చాన్నళ్లలో ప్రసారం అవుతున్నాయి.