తనకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిన మంగళం శీను క్యారెక్టర్ గురించి, అవకాశం ఇచ్చిన సుకుమార్ గురించి.. అలాగే తనకు మంగళం శీను క్యారెక్టర్ ని సుకుమార్ ఇవ్వడానికి గల కారణం కూడా రివీల్ చేశాడు సునీల్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. పుష్పరాజ్ క్యారెక్టర్ లో బన్నీ.. శ్రీవల్లి క్యారెక్టర్ లో రష్మిక మందాన.. అలాగే ఐటమ్ సాంగ్ లో సమంత ఇలా సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి, ఆర్టిస్టులకు పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ లభించింది. అలా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న నటులలో సునీల్ ఒకరు. ఈ సినిమాలో విలన్ మంగళం శీను క్యారెక్టర్ చేశాడు సునీల్. బేసిగ్గా కమెడియన్ అయిన సునీల్.. ఒక్కసారిగా విలన్ రోల్ లో కనిపించేసరికి ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు.
మంగళం శీను క్యారెక్టర్ లో సునీల్.. విలనిజం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. వీటన్నింటికి మించి మేకోవర్ మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత సునీల్ ని కొత్త గెటప్ లో చూశారు ఆడియెన్స్. ఇక పుష్ప తెచ్చిన క్రేజ్ తో సునీల్.. ఇప్పుడు పలు బిగ్గెస్ట్ సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్.. తనకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిన మంగళం శీను క్యారెక్టర్ గురించి, అవకాశం ఇచ్చిన సుకుమార్ గురించి మాట్లాడాడు. అలాగే తనకు మంగళం శీను క్యారెక్టర్ ని సుకుమార్ ఇవ్వడానికి కారణం కూడా రివీల్ చేశాడు.
పుష్పలో మంగళం శీను క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. ‘సుకుమార్ కి నాకు మంచి బాండింగ్ ఉంది. పుష్పలో క్యారెక్టర్ నేనే అడిగాను. ఈసారి క్యారెక్టర్ ఏదైనా అనగానే.. నువ్వు ఆల్రెడీ బాడీని అన్ని విధాలా వాడేశావు, అన్ని క్యారెక్టర్స్ చేశావు. సో.. ఏదైనా కొత్తగా చేద్దాం! అని ఈ మంగళం శీను క్యారెక్టర్ ఇచ్చారు. లాక్ డౌన్ కదా.. అప్పుడు ఇంట్లో ఉంటే క్యారెక్టర్ స్కెచ్ పంపించారు. దాంతో నేను వాళ్ళు పంపిన స్కెచ్ ప్రకారం రెడీ అయిపోయి.. ఫోటో టెస్ట్ చేసి చూపించాను. అప్పుడు సుకుమార్, ప్రొడ్యూసర్స్ ఓకే చేశారు’ అని చెప్పుకొచ్చాడు సునీల్. ప్రస్తుతం సునీల్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి పుష్పలో సునీల్ క్యారెక్టర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.