Shahid Afridi: నవీన్ ఉల్ హక్ ఎక్కడికి వెళ్లినా అందరితో దురుసుగానే ప్రవర్తిస్తాడంటూ కోహ్లీ అభిమానులు పేర్కొంటున్నారు. పీఎస్‌ఎల్‌లో అఫ్రిదీతో, లంక ప్రీమియర్ లీగ్‌లో పెరిరాతో ఇప్పుడు ఐపీఎల్‌లో కోహ్లీతో నవీన్ గొడవ పడ్డాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. కోహ్లీ వర్సెస్ నవీన్ ఉల్ హక్, కోహ్లీ వర్సెస్ గంభీర్‌గా సాగిన వాగ్వాదం పెద్ద చర్చనీయాంశమైంది. అయితే.. ఈ గొడవలో తప్పు ఎవరిదనే విషయంపై కూడా తీవ్ర స్థాయిలో వాదనలు జరుగుతున్నాయి. క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెటర్లు సైతం ఈ గొడవపై స్పందిస్తున్నారు. అయితే.. ఈ గొడవ అసలు కారణం.. ఈ సీజన్‌లో ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు చేసుకున్న అతి సంబురాలే కారణంగా నిలుస్తున్నాయి. చివరి బంతికి బైస్ రూపంలో పరుగు తీసి లక్నో విజయం సాధించింది.
దీంతో లక్నో ఆటగాడు ఆవేశ్ ఖాన్ హెల్మెట్‌ను నేలకేసికొట్టడం, ఆ జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ నేటిపై వేలు వేసుకుంటూ ఆర్సీబీ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇవ్వడం వైరల్‌గా మారింది. దీంతో.. తర్వాత మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడంతో కోహ్లీ సైతం అదే స్థాయిలో సంబురాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రీజ్‌లో ఉన్న అమిత్ షా, నవీన్ ఉల్ హక్‌తో కోహ్లీకి మాటామాట జరిగింది. దీని తర్వాత.. కోహ్లీతో మాట్లాడుతున్న కైల్ మేయర్స్‌ను గంభీర లాక్కెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఇది కోహ్లీ వర్సెస్ గంభీర్‌గా మార్చింది. ఈ ఘటన తర్వాత కొంతమంది తప్పు కోహ్లీదే అని, మరికొంత మంది గంభీర్‌ది తప్పు అని, అలాగే యువ క్రికెటర్ నవీన్ ఉల్ హక్‌ది కూడా చాలా తప్పు ఉందని అంటున్నారు.
ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ గతంలో నవీన్ ఉల్ హక్ గురించి చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘యువ ఆటగాడికి నాదో చిన్న సలహా.. ఆటపై ఫోకస్ పెట్టు.. ఇతర ఆటగాళ్లను తిట్టడంపై కాదు.’ అంటూ గతంలో పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా తనతో నవీన్ ప్రవర్తించిన తీరును ఉద్ధేశిస్తూ.. అఫ్రిదీ ట్వీట్ చేశాడు. దీంతో నవీన్ ఉల్ హక్ ఎక్కడికి వెళ్లినా అందరితో దురుసుగానే ప్రవర్తిస్తాడంటూ కోహ్లీ అభిమానులు పేర్కొంటున్నారు. పీఎస్‌ఎల్‌లో అఫ్రిదీతో, లంక ప్రీమియర్ లీగ్‌లో పెరిరాతో ఇప్పుడు ఐపీఎల్‌లో కోహ్లీతో నవీన్ గొడవ పడ్డాడు. అతని బుద్ధి మంచి కాదని, గతంలో అఫ్రిదీ చేసిన ట్వీట్‌తోనే తెలిసిపోతుందంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
My advise to the young player was simple, play the game and don’t indulge in abusive talk. I have friends in Afghanistan team and we have very cordial relations. Respect for teammates and opponents is the basic spirit of the game. https://t.co/LlVzsfHDEQ
— Shahid Afridi (@SAfridiOfficial) December 1, 2020