Rohit Sharma: ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇలాంటి మ్యాచ్‌లో ఓటమి ఎదురవడంతో చాలా అవమానంగా భావించిన రోహిత్ క్యాప్‌తో ఫేస్ దాచుకున్నాడంటూ..
ఐపీఎల్‌లో అందరి కంటే ఎక్కువ ట్రోఫీలు ఉన్న టీమ్ ముంబై ఇండియన్స్.. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉన్న ముంబై వద్ద ఏకంగా 5 ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. గత సీజన్‌లో వరుసగా 8 ఓటములు చవిచూసినా.. ఈ సీజన్‌లో హాట్ ఫేవరేట్స్‌లో ఒకటిగా ఉంది. అది ముంబై డామినేషన్. కానీ.. సీజన్‌ను మాత్రం రెండు వరుస ఓటములతో ఆరంభించింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో దారుణ ఓటమిని చవిచూసిన ముంబై.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలై.. అభిమానలను తీవ్రంగా నిరాశపర్చింది. అయితే.. చెన్నైపై ఓటమి తర్వాత రోహిత్ శర్మ ఫేస్‌ను క్యాప్‌తో కవర్ చేసుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై-చెన్నై మధ్య మ్యాచ్ అంటే ఐపీఎల్ ఆరంభం నుంచి విపరీతమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌లో బెస్ట్ రైవల్రీగా ముంబై-చెన్నై మ్యాచ్‌ను పేర్కొంటారు. పైగా ఇరు జట్లు ఐపీఎల్‌లోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు లోగోలు మార్చుకోని జట్లు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఈ రెండే. అది వాళ్ల సక్సెస్‌ను సూచిస్తుంది. ముంబై ఐదు సార్లు, చెన్నై నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచాయి. అందుకే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇలాంటి మ్యాచ్‌లో ఓటమి ఎదురవడంతో చాలా అవమానంగా భావించిన రోహిత్ క్యాప్‌తో ఫేస్ దాచుకున్నాడంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
ఇక మ్యాచ్ విషయాని వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(21), ఇషాన్ కిషన్(32), తిలక్ వర్మ(22), టిమ్ డేవిడ్(31) పరుగులతో పర్వాలేదనిపించగా.. సూర్యకుమార్ యాదవ్(1), కామెరున్ గ్రీన్(12), ట్రిస్టన్ స్టబ్స్(5) దారుణంగా విఫలం అయ్యారు. దీంతో ముంబై తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 2, సాంట్నర్ 2, జడేజా 3, మగల ఒక వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన చెన్నై 158 పరుగుల టార్గెట్‌ను 18.1 ఓవర్లలో ఛేదించింది. కావ్వె(0) విఫలైమనా.. రుతురాజ్ గైక్వాడ్(40 నాటౌట్), అజింక్యా రహానే(61), శివమ్ దూబే(28), అంబటి రాయుడు(20 నాటౌట్) రాణించడంతో చెన్నైకు విజయం చాలా సులువుగా దక్కింది. ముంబై బౌలర్లలో బెరెండ్రూఫ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో ముంబై ప్రదర్శన, రోహిత్ నిరాశపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Not a great start to IPL 2023 for Mumbai Indians and Rohit Sharma.
Hopefully a strong comeback in the coming matches by MI and The Hitman! pic.twitter.com/HKJw2NY0cK
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2023