Delhi Capitals, IPL 2023: ఒకరేమో ఆస్ట్రేలియాను ప్రపంచ ఛాంపియన్‌గా నడిపించారు, ఇంకొకరేమో టీమిండియా తలరాతను మార్చారు.. ఈ ఇద్దరూ కలిసినా.. ఒక ఐపీఎల్ టీమ్ దరిద్రం పొవడం లేదు.
ఐపీఎల్ 2023లో దాదాపు అన్ని జట్లు విజయం రుచి చూశాయి. ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రొమన్ పావెల్, సర్ఫారాజ్ ఖాన్, ఫిలిప్ సాల్ట్, రొలీ రొసొవ్, అభిషేక్ పొరెల్ లాంటి నిఖార్సయిన బ్యాటర్లు, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్ లాంటి మ్యాచ్ విన్నింగ్ ఆల్‌రౌండర్లు, కమలేష్ నాగర్‌కోఠి, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్గిడి, ముస్తఫిజుర్ రహీమ్, ఖలీల్ అహ్మాద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ లాంటి బౌలర్లు ఉన్నారు. వీరికి.. రికీ పాంటింగ్ లాంటి దిగ్గజం హెడ్ కోచ్‌గా, సౌరవ్ గంగూలీ లాంటి లెజెండ్ మెంటర్‌గా ఉన్నారు.. అయినా కూడా ఢిల్లీ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. టీమ్‌లోని ఆటగాళ్లు, కోచ్, మెంటర్ పేర్లు.. జట్టు ప్రదర్శనను చూస్తుంటే.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది ఢిల్లీ పరిస్థితి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక చెత్త టీమ్‌గా ముద్ర వేసుకుంది. ఢిల్లీకి పట్టిన ఈ దరిద్రానికి కారణమేంటో ఇప్పుడు పరిశీలిద్దాం..
ఢిల్లీకి వార్నర్-పృథ్వీ షా రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ ఉంది. కానీ.. ఏం లాభం పృథ్వీ షా చెత్త ఫామ్‌లో ఉన్నాడు. ఇక వార్నర్ పరుగులు చేస్తున్నా.. వేగంగా ఆడలేకపోతున్నాడు. వికెట్లు పడుతుండటంతో అతను స్పీడ్ పెంచలేక వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఢిల్లీ మిడిల్డార్ అయితే అత్యంత దారుణంగా ఉంది. ఒక్కరంటే ఒక్కరూ రాణించడం లేదు. ఐపీఎల్ కంటే ముందు టీమిండియాపైనే రెచ్చిపోయిన మిచెల్ మార్ష్ సైతం తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలం అయ్యాడు. ప్రస్తుతం పెళ్లి కోసం స్వదేశానికి వెళ్లిన మార్ష్ వారం తర్వాత తిరిగి రానున్నాడు. ఇక బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే.. అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మాద్, ముఖేష్ కుమార్, ముస్తఫీజుర్ లాంటి బౌలర్లు సైతం విఫలం అవుతున్నారు. టీమిండియా మేటి స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ సైతం ప్రభావం చూపలేకపోతున్నారు. ఇలా.. అందరూ విఫలం అవుతుండటం ఢిల్లీకి శాపంగా మారింది.
మరి జట్టు పరిస్థితి ఈ విధంగా ఉంటే.. హెడ్ కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్, మెంటర్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ ఏం చేస్తున్నారంటూ ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఫామ్‌లో లేని జట్టులోని ఆటగాళ్లను ఫామ్‌లోకి తేవడంలో పాంటింగ్, దాదా దారుణంగా విఫలం అవుతున్నారు. సరైన స్ట్రాటజీలతో ముందుకు వెళ్లడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉన్న పాంటింగ్ భారీ విజయాలు సాధించాడు. ఆసీస్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత కోచ్‌గా మారిన పాంటింగ్ ఢిల్లీ జట్టును సక్సెస్‌ఫుల్‌గా నడిపించడంలో విఫలం అవుతున్నాడు. ఇక దాదా గురించి చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమిండియాను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చాడో అందరికి తెలిసిందే. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు ఢిల్లీ మెంటర్‌గా ఉంటూ.. పృథ్వీ షా లాంటి యువ క్రికెటర్లతో మంచి ఫలితాలు సాధించలేకపోతున్నాడు. దీంతో.. పాంటింగ్-గంగూలీ వల్ల ఢిల్లీకి పెద్దగా ఉపయోగం లేదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
WATCH: Ganguly, Ponting don’t know as Warner’s last-ball mis-throw troubles DC Cricket – https://t.co/0zqV7vFZYu pic.twitter.com/YGhzfL6SA3
— aa_crickett (@manas_bagla) April 12, 2023