విరాట్ కోహ్లీ అంటే అందరికీ గుర్తొచ్చేది. అతని అగ్రెసివ్‌నెస్. గత మ్యాచులో మాజీ దిగ్గజం గౌతం గంభీర్ కి కౌంటర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటిది కోహ్లీ శిరస్సు వంచి పాదాలకు నమస్కరించాడంటే నమ్ముతారా..? అవును నిజం.. మీరు నమ్మాల్సిందే. చేస్తున్న ప్రాక్టీస్ ఆపేసి మరి కోహ్లీ ఒక వ్యక్తి వద్దకు చేరుకుని వినయంగా పాదాలకు నమస్కరించాడు.
‘గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః’
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అలా అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గురువు గొప్పతనం తప్పక ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా మాజీ సారథి, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడంటే.. దాని వెనకున్న గొప్పతనం రాజ్ కుమార్ శర్మదే. కోహ్లీ చిన్నప్పుడు ఇతని వద్ద క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ ఓనమాలే నేడు అతన్ని క్రికెట్ ప్రపంచానికి ‘రారాజు’ను చేశాయి. మరి ఆ గురువుకు సరైన గౌరవం ఇవ్వాలి కదా! అందుకే కోహ్లీ తన చిన్ననాటి కోచ్ కనపడగానే శిరస్సు వంచి కాళ్లకు నమస్కరించాడు.
కోహ్లీ స్వస్థలం ఢిల్లీ అని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీ రాయల్ బెంగుళూరు జట్టు తరుపున ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు తన సొంతగడ్డకు విచ్చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ చిన్ననాటి కోచ్ అయిన రాజ్ కుమార్ శర్మ తన శిష్యుడిని చూసేందుకు అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చారు. తన గురువును చూడగానే కోహ్లీ చేస్తున్న ప్రాక్టీస్ ను ఆపేసి మరి నేరుగా అతని వద్దకు చేరుకుని వినయంగా పాదాలకు నమస్కరించాడు. కోహ్లీ విధేయత పట్ల ఎంతో సంతోషించిన ఆయన శిష్యుడి వీపు తట్టి దీవెనలు అందించాడు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
Arrogant Virat Kohli touching the feet of his Childhood coach, Rajkumar Sharma.
Man of culture! ❤️ #DCvRCBpic.twitter.com/PEngI38tII
— Sexy Cricket Shots (@sexycricketshot) May 6, 2023