కీరన్ పొలార్డ్.. టీ 20 క్రికెట్ లో ఇతను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోలార్డ్ కేవలం మూడు ఓవర్లు క్రీజ్ లో ఉంటే చాలు మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఇక తెలివిగా బౌలింగ్ కూడా చేయగలడు. బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన ఫీల్డింగ్ చేయగలడు. కెప్టెన్ గా రాణించగలడు. అన్నిటికీ మించి ఫిట్నెస్ సమస్యలు అస్సలే లేవు. మరి.. ఇంత గొప్ప ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ అయినా వదులుకుంటుందా? కచ్చితంగా వదులుకోదు. ముంబై ఇండియన్స్ కూడా ఇలానే కీరన్ పొలార్డ్ ని రిటైన్ చేసుకుంది. కానీ.., ముంబై ఇండియన్స్ పోలార్డ్ ని రిటైన్ చేసుకున్న విధానమే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ముంబై మొత్తం నలుగురు ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. వీరిలో ముగ్గురు దేశీయ ఆటగాళ్లు కాగ, ఒక్కరు మాత్రమే విదేశీ ఆటగాళ్లు. వీరిలో రోహిత్ శర్మని 16 కోట్ల రూపాయలకి, బుమ్రాని 12 కోట్ల రూపాయలకి, సూర్యకుమార్ యాదవ్ ని 8 కోట్ల రూపాయలకి, పోలార్డ్ ని కేవలం 6 కోట్ల రూపాయలకి ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది.
పోలార్డ్ లాంటి స్టార్ ఆల్ రౌండర్ దక్కాలంటే మాటలు కాదు. అలాంటి ప్లేయర్స్ మళ్ళీ దొరకరు కూడా. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి పోలార్డ్ ముంబై జట్టులోని ఉన్నాడు. అలాంటి ఆటగాడిని కేవలం ముంబై 6 కోట్లకి ఎలా దక్కించుకుంది అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పోలార్డ్ కేవలం ఈ 6 కోట్ల రూపాయల ఆఫర్ ని తిరస్కరించి, మెగా ఆక్షన్ కి గనుక వచ్చి ఉంటే అతనిపై కోట్ల రూపాయల వర్షం కురిసి ఉండేది. చాలా ఫ్రాంచైజీలు పోలార్డ్ ని దక్కించుకోవడానికి పోటీ పడేవి. ఈ విషయం పోలార్డ్ కి కూడా తెలుసు. కానీ.., అతను మెగా ఆక్షన్ కి పొదలుచుకోలేదు. ఎందుకంటే పోలార్డ్ ముందు నుండి ముంబై ఇండియన్స్ ని తన సొంత జట్టులా ఫీల్ అవుతూ వస్తున్నాడు.
అప్పట్లో ఛాంపియన్స్ లీగ్ అని ఒక టోర్నమెంట్ ఉండేది. ఆ సమయంలో కూడా పోలార్డ్ తన దేశపు ఫ్రాంచైజీల తరుపున కాకుండా ముంబై ఇండియన్స్ తరపునే ఆడేవాడు. ఇక ప్రతి సీజన్ జట్టుకి తప్పకుండా అందుబాటులో ఉంటూ వచ్చాడు. “తన దగ్గర ఆట తప్ప ఏమి లేని రోజున.., ముంబై ఇండియన్స్ నమ్మకం ఉంచి, ఆదరించింది. అలాంటిది.. ఈరోజు డబ్బు కోసం తాను బయటకి వెళ్లడం భావ్యం కాదని పోలార్డ్ భావించినట్టు తెలుస్తోంది. అందుకే పోలార్డ్ ముంబై ఇచ్చిన 6 కోట్ల ఆఫర్ కి మౌనంగా అంగీకారం తెలిపాడని సమాచారం. ఒకవేళ పోలార్డ్ గనుక ఏ ఆఫర్ ని కాదని మెగా ఆక్షన్ కి వెళ్లి ఉంటే.. పోలార్డ్ కి 12 కోట్ల రూపాయలకి పైగానే లభించే ఉండేవి. ఏదేమైనా లాయల్టీ కోసం కోట్ల రూపాయలు వదులుకున్న పోలార్డ్ నిజంగా అభినందనీయుడు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.