ఐపీఎల్ 2022 మజా మొదలైపోయింది. సాయంత్రం అయ్యింది అంటే అంతా టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ప్రతి బాల్ బౌండిరీకి పరిగెడుతుంటే అభిమానులు కళ్లార్పకుండా చూస్తుంటారు. అందరి ఆటగాళ్ల హిట్టింగ్ వేరు.. వెస్టిండీస్ ఆటగాళ్లు క్రీజులో ఉంటే ఆ మజా వేరుటుంది. గేల్, పొలార్డ్, రస్సెల్ ఇలాంటి ఆటగాళ్లు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సామర్థ్యం ఉన్న వాళ్లు. ఇప్పటికే ఆ విషయం చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు కూడా. తాజాగా ఆ జాబితాలోకి ‘ఓడిన్ స్మిత్’ అనే పేరు చేరిందని టాక్ మొదలైంది. అసలు ఎవరీ ఓడిన్ స్మిత్ అనే వెతుకులాట మొదలెట్టేశారు. అయితే క్రికెట్ కు ఓడిన్ పేరు కొత్తేం కాదు. అతనికి క్రికెట్ లో పెద్ద హిస్టరీనే ఉంది.
ఇదీ చదవండి: ముంబై కొంపముంచిన సామ్స్! సెంటిమెంట్ మళ్లీ రిపీట్
ఓడిన్ స్మిత్ కు వెస్టిండీస్ క్రికెట్ లో పెద్ద పేరే ఉంది. ఒకానొక సమయంలో గేల్, రస్సెల్, పొలార్డ్ వంటి ఆటగాళ్లు కూడా ఓడిన్ హిట్టింగ్ చూసి కంగారు పడిన వాళ్లే. మొదట ఓడిన్ నగికో సూపర్ 50 కాంపిటీషన్ లో వెస్టిండీస్ లిస్ట్ ఏ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2016 అండర్-19 వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో ఓడిన్ కూడా సభ్యుడు. ఇప్పుడు విధ్వంసకర బ్యాటర్ అనుకుంటున్న హెట్ మేయర్ తో కలిసి ఓడిన్ క్రికెట్ ఆడాడు.వెస్టిండీస్ లో ప్రతి జట్టు ఓడిన్ స్మిత్ ను కావాలని కోరుకుంటుంది. ఇప్పటివరకు ఓడిన్ స్మిత్ ఆడిన జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ‘గుయానా అమెజాన్ వారియర్స్, జమైకా, త్రినిదాద్ అండ్ టొబాగో, వెస్టిండీస్ బీ, సెయింట్ లూసియా స్టార్స్, వెస్టిండీస్ ఏ, జమైకా తల్లావాస్, వెస్టిండీస్ అండర్-19, వెస్టిండీస్, వెస్టిండీస్ అండర్-19’ జట్లలో ఓడిన్ ఆడాడు. ఆరడుగుల పొడవు, నుంచున్న చోటు నుంచే బాల్ ను సునాయాసంగా బౌండిరీకి పంపగల సామర్థ్యం. ఇవన్నీ ఉన్నా కూడా అతను బాలింగ్ ఆల్రౌండర్ కావడంతో గుర్తింపు సాధించడానికి కాస్త సమయం పట్టింది అనుకోవచ్చు. అలాంటి స్టార్ హిట్టర్ కమ్ బౌలర్ ను పంజాబ్ కింగ్స్ చాలా తక్కువ ధరకే సొంతం చేసుకుంది. ఇక నుంచి పంజాబ్ కు ఓడిన్ మెయిన్ ప్లేయర్ అనడంలో సందేహం లేదు. ఓడిన్ ఆటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Odean Smith is a super striker!! What a run chase by Punjab Kings. #OdeanSmith pic.twitter.com/jul4ngZl7j
— Trending Cric Zone (@rishabhgautam81) March 27, 2022
Meet the power-packed all-rounder ➡️ Odean Smith 🔥#SaddaPunjab #IPL2022 #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ pic.twitter.com/AbGiN68hfC
— Punjab Kings (@PunjabKingsIPL) March 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.