వెస్టిండీస్ పర్యటనలో బ్యాట్‌తో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ.. టూర్‌లో తన పని ముగియడంతో స్వదేశానికి చేరుకున్నాడు. అయితే ఎప్పటిలా కమర్షియల్ ఫ్లయిట్‌లో కాకుండా కోహ్లీ భారత్‌కు ఎలా వచ్చాడంటే..
ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ను టీమిండియా 1-0తో చేజిక్కించుకుంది. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ రెండు సిరీస్‌ల్లోనూ పాలు పంచుకున్న సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు కరీబియన్ దీవుల్లో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్నప్పటికీ.. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పొట్టి ఫార్మాట్ నుంచి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో కోహ్లీ స్వదేశానికి వచ్చేశాడు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారా?
అయితే కోహ్లీ.. ఎప్పట్లా ఈ సారి కమర్షియల్ ఫ్లయిట్‌లో కాకుండా.. తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చార్టర్డ్ ఫ్లయిట్‌లో స్వదేశానికి వచ్చాడు. ఇటీవల వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్ అనంతరం తొలి వన్డేకు ముందు భారత ఆటగాళ్లు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. రాత్రి ప్రయాణం కావడంతో పాటు అనివార్య కారణాలతో విమానం లేట్ కావడంతో టీమిండియా దాదాపు 8 గంటలకు పైగా విమానాశ్రయంలోనే పడిగపులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిపై జట్టు సభ్యులతో పాటు మేనేజ్‌మెంట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాత్రి పూట ప్రయాణాలు లేకుండా చూడాలని బీసీసీఐని కోరింది. అయితే పొట్టి సిరీస్‌లో పాల్గొనని కోహ్లీ.. ఇక నేరుగా ఆసియాకప్ బరిలో దిగనున్నాడు.
ఆసియాకప్ ప్రారంభానికి ముందు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసేందుకు కోహ్లీ ముంబై చేరుకున్నాడు. ‘గ్లోబల్ ఎయిర్ చార్టర్ సర్విసెస్’ వారి ప్రత్యేక విమానంలో కోహ్లీ స్వదేశానికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కోహ్లీ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ‘నా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఏసీఎస్ ఎయిర్ చార్టర్, కెప్టెన్ అబు పటేల్‌కు ధ్యాంక్స్’ అని పోస్ట్ చేశాడు. ఇటీవల 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 76వ శతకం తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఇక నేరుగా ఆసియాకప్‌లోనే ఆడనున్నాడు. కోహ్లీతో పాటు రోహిత్‌కు కూడా పొట్టి సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు.
Global air charter services arranged a special flight for King Kohli from West Indies to India. pic.twitter.com/FhqGKksfqG
— Johns. (@CricCrazyJohns) August 3, 2023