రెండు నెలలకు పైగా సాగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. తుదిపోరులో రాజస్థాన్ ను ఓడించి కొత్త ఛాంపియన్ గా అవతరించింది. సుదీర్ఘంగా జరిగిన ఈ టోర్నీలో ఎలాంటి అంచనాల్లేని పలువురు ఆటగాళ్లు హీరోలు అనిపించుకోగా.. పలువురు హీరోలు కాస్తా జీరోలయ్యారు.
వాళ్లంతా మేటి ఆటగాళ్లే.. ఎల్లలు దాటి ఫ్యాన్ ఫాలోయింగ్, ఒంటి చేత్తో మ్యాన్ను శాసించగల సత్తా.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు. ఈ లెక్కలు చూసే కోట్ల రూపాయలు కుమ్మరించి మరీ ఫ్రాంచైజీలు వారిని కొనుగోలు చేశాయి. అయినా ఏం లాభం..? ‘కుడి ఎడమై పొరపాటు లేదోయ్’ అన్నట్టుగా ఈ సీజన్ లో వారి ప్రదర్శన చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
1. కేన్ విలియమ్సన్ (సన్ రైజర్స్ హైదరాబాద్) : ఈ సీజన్ మొత్తమ్మీద అత్యంత చెత్త ఆటతో తీవ్ర విమర్శల పాలైన ఆటగాడు కేన్ మామ. టీ20 లలో టెస్టుల మాదిరి ఆడి విమర్శల పాలయ్యాడు. కెప్టెన్ గా కొన్నిసార్లు ఫర్వాలేదనిపించినా.. గుజరాత్ టైటాన్స్ తో ఆఖరి ఓవర్ ను జాన్సేన్ కు ఇవ్వడం.. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో వ్యూహాల వైఫల్యం.. బౌలర్లను సరిగా ఉపయోగించుకోకపోవడంతో పాటు బ్యాటర్ గా తాను కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. 13 మ్యాచుల్లో 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్కటే హాఫ్ పెంచరీ ఉంది.
Kane Williamson#IPL2022 #KKRvSRH pic.twitter.com/irSFRllr5D
— RVCJ Media (@RVCJ_FB) May 14, 2022
2. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) : ఈ సీజన్ లో మునుపెన్నడూ లేనంతగా లీగ్ లో చిట్ట చివర నిలిచింది ముంబై. సారథిగానే గాక ఆటగాడి గా కూడా హిట్ మ్యాన్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ముంబై ఈ సీజన్ లో నాలుగు మ్యాచుల్లో గెలిచి.. పది మ్యాచుల్లో ఓడింది. వరుసగా 8 మ్యాచుల్లో పరాజయం పాలైంది. జట్టును నడిపించడంలో, ఉన్న వనరులను ఉపయోగించుకోవడంలో హిట్ మ్యాన్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఇక ఆటగాడిగా కూడా రోహిత్ కు ఇది దారుణమైన సీజన్. తన ఐపీఎల్ కెరీర్ లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని సీజన్ గా ఇది మిగిలింది. 14 మ్యాచులాడిన రోహిత్.. 268 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 48.
Rohit Sharma will want to forget this campaign in a hurry #IPL2022 pic.twitter.com/bZX9PNtZJc
— ESPNcricinfo (@ESPNcricinfo) May 21, 2022
3. రవీంద్రా జడేజా: ఐపీఎల్ 2022 సీజన్.. రవీంద్ర జడేజాకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. జట్టులో సీనియర్‌గా ఉన్న జడేజాపై నమ్మకముంచిన మేనేజ్‌మెంట్, నాయకత్వ బాధ్యతలు జడ్డూకు అప్పగించింది. జడ్డూ కెప్టెన్సీని సంతోషంగా అంగీకరించినప్పటికి.. నాయకత్వంలో ఘోరంగా విఫలమయ్యాడు. పోనీ ఆటగాడిగా రాణించడా అంటే లేదు. దారుణ ప్రదర్శన కనబర్చాడు.
4. విరాట్ కోహ్లీ(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): క్రికెట్ ప్రపంచంలో రన్ మెషిన్ గా పేరొందిన.. కోహ్లీ ఈ సీజన్ లో మాత్రం పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డాడు. ఈ సీజన్ లో మూడు సార్లు డకౌట్ అయ్యి అభిమానులను మరింత నిరాశపరిచాడు. అఫ్ కోర్సు రెండు సెంచరీలు చేసినా అందుకు తగ్గట్టుగా స్ట్రైక్ రేట్ లేదు. మొత్తంగా 16 మ్యాచులు ఆడిన విరాట్.. 341 పరుగులు చేశాడు.
Virat Kohli reacts after RCB failed to make their way into the final of IPL 2022.#ViratKohli #RCB #IPL2022 #Cricket #CricTracker pic.twitter.com/4XOKSUcXCH
— CricTracker (@Cricketracker) May 28, 2022
5. మయాంక్ అగర్వాల్ (పంజాబ్ కింగ్స్) : సీజన్ కో సారథి మారే పంజాబ్ లో ఈసారి ఆ అదృష్టం మయాంక్ ను వరించింది. 12 కోట్లు పెట్టి మయాంక్ ను రిటైన్ చేసుకున్న పంజాబ్ క్యాప్టిన్ గా కూడా నియమించింది. ఆటగాడిగానే గాక సారథిగా కూడా మయాంక్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఈ సీజన్ లో 13 మ్యాచులు ఆడిన మయాంక్.. 196 పరుగులు మాత్రమే చేశాడు.
Is captaincy affecting Mayank Agarwal’s batting?#IPL2022 pic.twitter.com/2nvjBoiQvP
— ESPNcricinfo (@ESPNcricinfo) May 17, 2022
6. వెంకటేష్ అయ్యర్ (కోలకతా నైట్ రైడర్స్): గత ఐపీఎల్ సీజన్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు వెంకటేష్ అయ్యర్. ఐపీఎల్ 14వ సీజన్‌లో తొలి అంచె పోటీల్లో వెంకటేశ్ అయ్యర్ పెద్దగా అవకాశాలు లభించలేదు. అయితే కరోనా బ్రేక్ తర్వాత జరిగిన రెండో అంచె పోటీల్లో మాత్రం దుమ్ములేపాడు. దీని కారణంగా వెంకటేశ్ అయ్యర్‌ని ఏకంగా రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అయితే ఈ సీజన్‌లో అయ్యర్ ఘోర ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన అయ్యర్ కేవలం 182 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
7. వరుణ్ చక్రవర్తి (కోలకతా నైట్ రైడర్స్): గత సీజన్ లో కోలకతా గ్నిట్ రైడర్స్ జినల్ వరకు వెళ్లేందంటే ప్రధాన కారణం.. వరుణ్ చరవర్తి. అనామకుడిగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి.. మిస్టరీ స్పిన్నర్ గా తనకంటూ ఓకే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో కేకేఆర్.. 8 కోట్లు పెట్టి వరుణ్ చక్రవర్తి ని రిటైన్ చేసుకుంది. ఈ సీజన్ లో 11 మ్యాచులు ఆడిన వరుణ్ చక్రవర్తి కేవలం 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
8. మహమ్మద్ సిరాజ్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): ఐపీఎల్ 2022 సీజన్‌లో సిరాజ్ పేలవ ప్రదర్శనతో విసిగిపోయిన.. సొంత జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. ఈ సీజన్ లో 15 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ కేవలం 9 వికెట్లు మాత్రమే తీసాడు. అంతేకాకుంగా ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతని ఎకానమీ 10.08గా ఉంది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఆర్‌సీబీ 7 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది.
Most Runs Conceded in IPL 2022 by Mohammad Siraj 😳#IPLFinal #RajasthanRoyals #RCBvsRR pic.twitter.com/cc8NdestQo
— Cricket Addictor (@AddictorCricket) May 28, 2022
9. కీరన్ పొలార్డ్(ముంబై ఇండియన్స్): ఈ సీజన్‌లో రూ.6 కోట్లతో ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న కీరన్ పొలార్డ్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచుల్లో కేవలం 144 పరుగులు మాత్రమే చేశాడు పొలార్డ్. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. యావరేజ్ 14.40 . స్ట్రైక్ రేట్ అయితే 106. ఒకప్పుడు 200కి స్టైక్ రేట్ తో బాదే పొలార్డ్ ని చూస్తే జాలేస్తేంది. దీంతో.. తన ప్రదర్శన చూస్తుంటే పొలార్డ్ కు ఇదే చివరి ఐపీఎల్ అనిపిస్తోంది.
Kieron Pollard’s struggles continue this season with the bat 📉
Striking at just over a run-a-ball, it’s his lowest in the IPL so far 😮 #IPL2022 #AskCricinfo
— ESPNcricinfo (@ESPNcricinfo) May 6, 2022
10. అబ్దుల్ సమాద్ (సన్ రైజర్స్ హైదరాబాద్): గత సీజన్ లో అద్భుత ఆటతీరు కనబర్చిన ఈ యువ క్రికెటర్ ను సన్ రైజర్స్ రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ సీజన్ ,లో రెండు మ్యాచులు మాత్రమే అబ్దుల్ సమాద్ 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తరువాత బెంచ్ కే పరిమితయ్యాడు. అబ్దుల్ సమాద్ ను రిటైన్ చేసుకోవడం వల్ల సన్ రైజర్స్ కు ఏమాత్రం లాభం లేదు.
ఇది కూడా చదవండి: Sunrisers Hyderabad: చేజేతులా నాశనం చేశారు. IPL అయిపోయినా శాంతించని SRH ఫ్యాన్స్!