బీసీసీఐకి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీగా పేరొందిన ‘ఐపీఎల్’ లో వింత అనుభవం ఎదురైంది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు పవర్ కట్ సమస్యగా మారింది. పవర్ లేక 5 నిముషాలు ఆలస్యంగా ప్రారంభమైన ఆట ఐపీఎల్ పరువు దిగజారేలా చేసింది. స్టేడియంలో పవర్ కట్ ఉన్నందున డీఆర్‌ఎస్ తీసుకునేందుకు అవకాశం లేదంటూ తేల్చేశారు రిఫరీలు.దీంతో తొలి రెండు ఓవర్లలో డీఆర్‌ఎస్ అందుబాటులో లేకుండా పోయింది. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌ను ఘోరంగా దెబ్బ తీసింది.
డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ రెండో బంతికే డేవాన్ కాన్వే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. స్టేడియంలో పవర్ కట్ కారణంగా డీఆర్‌ఎస్ కోరుకునే అవకాశం లేకుండా పోయింది. నాన్ స్ట్రైకర్ రుతురాజ్ దీనిపై అంపైర్లతో మాట్లాడిన ఫలితం లేకపోయింది. అయితే బంతి లెగ్ సెడ్ వెళ్లినట్లు అనిపించింది. అయితే అంపైర్ ఔటివ్వడంపై కాన్వే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇక.. మొదటి ఓవర్ నాలుగో బంతికి మోయిన్ అలీ(0) క్యాచ్ ఔటవ్వగా.. రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప సైతం వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ కరెంట్ రాకపోవడంతో డీఆర్‌ఎస్ కోరుకునే అవకాశం లేకపోయింది. దాంతో ఊతప్ప(1) నిరాశగా పెవిలియన్ చేరాడు.
Unlucky for Devon Conway, the ball was missing leg stump. He couldn’t take the DRS due to powercut in the stadium. pic.twitter.com/kyaUJsZw9e
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2022
ఇది కూడా చదవండి: Rovman Powell: పేదరికం నుంచి బయటపడేందుకు క్రికెటర్ అయ్యాను: పావెల్
ఈ సీజన్‌లో కొత్త ఫ్రాంఛైజీల బిడ్ల ద్వారా రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించిన బీసీసీఐ, మ్యాచుల నిర్వహణ విషయంలో ఇంత అద్వానంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వరల్డ్ బెస్ట్ లీగైన ఐపీఎల్ కు ‘పవర్ కట్’.. సమస్యగా మారడం సిగ్గు చేటని, కోట్ల డబ్బులున్న బీసీసీఐ ఈ విషయంలో సిగ్గుపడాలని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.
WELL DONE 🫡😐 @BCCI @IPL The match was not supposed to be late without drs, drs started after csk’s main wicket was gone.Your one wrong decision can keep that team away from the playoffs.#BCCI #ipl #whybcci #DevonConway #whybcci pic.twitter.com/1DGZRGwuxv
— Aditya Navale (@N89189381Aditya) May 12, 2022