మీరు ధోనీ కోసమే ఐపీఎల్ చూస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగి ఈ ఆర్టికల్ చదవండి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ధోనీ ఆడకపోవచ్చు అనిపిస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
ధోనీకి వయసుతో పాటే క్రేజ్ కూడా తెగ పెరిగిపోతోంది. లేకపోతే ఏంటబ్బా.. టీమిండియాకు ఆడినన్నీ రోజులు అద్భుతమైన
ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ, ఫ్యాన్ బేస్ అస్సలు తగ్గట్లేదు. ఎంతలా అంటే ప్రతి ఏడాది ఐపీఎల్ కోసం ఎదురుచూస్తారో లేదో తెలియదు గానీ, ధోనీ బ్యాటింగ్ తెగ వెయిట్ చేస్తుంటారు. ఈ సీజన్ లోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. ధోనీ క్రీజులోకి రాగానే.. జియో సిDhoniనిమాస్ యాప్ లో వ్యూస్ రయ్ అని పైకి లేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఫ్యాన్స్ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక విషయానికొస్తే.. ఈసారి ఐపీఎల్ పెద్దగా బజ్ లేకుండానే స్టార్టయింది. రీసెంట్ టైంలో మాత్రం ఒక్కో మ్యాచ్ రంజుగా మారిపోతున్నాయి. చివరి ఓవర్ వరకు హోరాహోరీగా జరుగుతుండటం చూస్తుంటే.. థ్రిల్లర్ సినిమాలే గుర్తొస్తున్నాయి. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్.. 5 మ్యాచుల్లో 3 విజయాలతో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే మహీకి సీజన్ ప్రారంభానికి ముందే మోకాలికి గాయమైంది. కానీ అదేమంత పెద్దది కాకపోవడంతో మ్యాచులు ఆడేస్తూ వచ్చాడు. కానీ అది ఇప్పుడు సీరియస్ అయిందా అనిపిస్తోంది.
ఎందుకంటే ఏప్రిల్ 21న సన్ రైజర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉంది. దీనికోసం సీఎస్కే ప్రాక్టీసులో ఫుల్ బిజీగా ఉంది. కానీ ధోనీ బదులు ఓపెనర్ కాన్వే.. వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. ఇదే ఇప్పుడు కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే.. నెక్స్ట్ మ్యాచ్ లో ధోనీ విశ్రాంతి తీసుకుంటాడా అనిపిస్తుంది. ఒకవేళ మరీ కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా అయినా సరే రావొచ్చని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ధోనీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. ఐపీఎల్ లవర్స్ అందరూ కూడా ఇది నిజం కాకుడదని కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది రేపటి మ్యాచ్ స్టార్టయ్యే వరకు తెలీదు. మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Devon Conway practicing wicketkeeping in the practice session. pic.twitter.com/iViPu2ybG4
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2023