తాజాగా ఐపీఎల్ లో ముంబయి vs గుజరాత్ మ్యాచ్ లో సందేహం కలిగించే ఓ సంఘటన జరిగింది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరగడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. వరల్డ్ మోస్ట్ పాపులర్ టీ20 లీగ్ అయిన ఐపీఎల్ లోనూ గతంలో ఇలాంటివి జరిగినట్లు ఆరోపణలు రావడంతో అప్పట్లో చెన్నై, రాజస్థాన్ జట్లపై తలో రెండేళ్లపాటు నిషేధం విధించారు. ప్రజలు మరిచిపోవచ్చేమో కానీ క్రికెట్ ప్రేమికులు ఇంకా వాటిని అస్సలు మరిచిపోలేదు. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఈసారి ఐపీఎల్ మ్యాచులు అందరికీ లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రతి మ్యాచ్ కూడా ఫిక్స్ అవుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా ముంబయి-గుజరాత్ మ్యాచ్ లోనూ ఫిక్సింగ్ కి కాస్త బలం చేకూర్చే సంఘటన ఒకటి జరిగినట్లు కనిపిస్తుంది.
అసలు విషయానికొస్తే.. ఒకప్పటితో పోలిస్తే క్రికెట్ లో వేగం పెరిగింది. సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో మ్యాచ్ లో ఏ చిన్న సంఘటన అనుమానంగా అనిపించినా సరే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా ముంబయి – గుజరాత్ మ్యాచ్ లోనూ కాస్త అటుఇటుగా అలాంటిదే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 207/6 స్కోరు చేసింది. ఛేదనలో ముంబయి 152/9 మాత్రమే పరిమితమైంది. ఈ మ్యాచులో 55 పరుగుల తేడాతో గెలిచిన గుజరాత్ టాప్ లోకి వెళ్లిపోయింది. కానీ ఓ విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయింది.
గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో అంటే మూడో ఓవర్ తొలి బంతిని అర్జున్ టెండూల్కర్ వేశాడు. అప్పుడు సాహా బ్యాటింగ్ చేస్తున్నాడు. బంతి వెళ్లి నేరుగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతుల్లో పడింది. అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. ఈ క్రమంలోనే సాహా, అవతల ఎండ్ లో ఉన్న గిల్ తో చర్చించి రివ్యూ తీసుకున్నాడు. కానీ 15 సెకన్ల టైమ్ అప్పటికే దాటిపోయింది. అయినా సరే అంపైర్లు దాన్ని అంగీకరించారు. చివరగా సాహా ఔట్ అని తేలింది. గుజరాత్ కి ఓ రివ్యూ వేస్ట్ అయింది. అయితే రూల్ అంటే అందరికీ ఒకేలా ఉండాలి. కానీ అంపైర్లు ఎందుకు రివ్యూ రూల్ ని పాటించలేదు అని పలువురు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అసలే ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటివి జరుగుతుండేసరికి ఆ ఆరోపణలకు ఇంకా బలం చేకూరుతోంది. మరి సాహా రివ్యూ విషయంలో అంపైర్లు రూల్ ఫాలో కాకపోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
— rajendra tikyani (@Rspt1503) April 25, 2023