ఐపీఎల్ 2023 సీజన్ 'ఒక స్క్రిప్టెడ్ ఫార్మాట్..లో సాగుతోందా! మరి పదే పదే ఈ అంశాన్ని అభిమానులు ఎందుకు లేవనెత్తుతున్నారు. అధునాతన టెక్నాలజీని కూడా వీరి తమకు అనుకలంగా మార్చుకున్నారా? ఏం జరుగుతోంది ఈ సీజన్‌లో...
ఐపీఎల్ 2023 సీజన్ మీకేమైనా తేడా అనిపిస్తోందా..! ఆఖరి ఓవర్‌లో ఐదు సిక్సులు కొట్టి గెలిపించడం, చివరి బంతిని నోబాల్ వేయటం, అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు.. అబ్బో ఇలా చాలానే జరుగుతున్నాయి కదా! వీటన్నిటికీ తోడు డెసిషన్ రివ్యూ సిస్టంలో ఉపయోగించే అధునాతన టెక్నాలజీ ‘స్నికో మీటర్’ చేస్తోన్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ‘తగిలినప్పుడు.. తగలనట్లుగా..’, ‘తగలనప్పుడు.. తగిలినట్లుగా..’ స్నికో మీటర్ భలే చూపిస్తోంది. ఇది అభిమానులకు పలు అనుమానాలు కలిగిస్తోంది. బుధవారం, చెపాక్ వేదికగా జరుగుతోన్న ఢిల్లీ వర్సెస్ చెన్నై మ్యాచులో మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అంపైర్ నిర్ణయాన్ని సమీక్ష కోరే పద్దతిలో ‘స్నికో మీటర్’ ఉపయోగిస్తున్నారన్న సంగతి అందరికీ విదితమే. ఎల్బీడబ్ల్యూ నిర్ణయాన్ని, క్యాచ్ ఔట్‌ను సమీక్షించే సమయంలో బాల్.. బ్యాట్‌ను తగిలిందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు. చెపాక్ వేదికగా నేడు జరుగుతోన్న ఢిల్లీ వర్సెస్ చెన్నై మ్యాచులో సీఎస్‌కే బ్యాటర్ డెవాన్ కాన్వే ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై ఢిల్లీ బ్యాటర్లు డీఆర్ఎస్ కోరగా, ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు సూచించాడు. అనంతరం థర్డ్ అంపైర్ స్నికో మీటర్ సాయంతో బాల్.. బయట తగిలిందా లేదా అన్న దానిని చెక్ చేస్తుండగా ఓ తప్పు బయటపడింది. బ్యాట్‌కు బాల్ ఆమడదూరం ఉన్నా స్నికోలో తగినట్లుగా స్పైక్ చూపించింది. దీంతో అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. అందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
CSK and Fixing……alag nahi ho sakate😂😂😂
Konse planet se yaha spike dikh Raha he??? @ChennaiIPL #AskStar pic.twitter.com/pJxNsKEpRu
— scalperr🇮🇳 (@fan_rashami) May 10, 2023
ఇందులో తప్పు స్నికో మీటర్‌ది అయినా, ఈ నిర్ణయాలు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని మెడకు చుట్టుకుంటున్నాయి. ‘ధోని మాజీ సారథి కాబట్టి ఘనంగా సెండాఫ్ ఇవ్వడానికే ఇదంతా ప్లాన్ చేశారంటూ..’ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ సీజన్ మీద అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మ్యాచులన్నీ స్క్రిప్టెడ్ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు సీజన్లలో ఇలాంటి సీన్లు ఎన్నడూ జరగలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడతాయని చెప్తుతున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It was clearly out 👆.
CSK fans accuse MI bribing Umpire. But here we can clearly see no Bat involved even though Umpire gave it not out.
Chennai Fixer Kings#CSKvDC #IPL2023 #DevonConway #out pic.twitter.com/I1bs3F3Qll— India Insight (@SwapnilDm2) May 10, 2023