శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ రోజుల్లో ఎక్కువమంది కి వస్తున్న జబ్బు గుండెపోటు. ఇది ఎప్పుడు వస్తుందో అనేది చెప్పడం చాలా కష్టం. గుండె జబ్బులు ఉన్న వారు ఎక్కువగా బాత్రూం లో ఉన్న సమయంలోనే హార్ట్ ఎటాక్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఎన్ సీ బి ఐ మార్కెటింగ్ ఏజెన్సీ రిపోర్ట్స్ ప్రకారం 11 శాతం హార్ట్ ఎటాక్ లు బాత్ రూమ్ లో ఉన్న సమయంలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి.
హార్ట్ఎటాక్ వచ్చేందుకు ఆహార నియమాలు, మానసిక ఒత్తిడులు, అధిక కొవ్వు ఇలా అనేక కారణాలు ఉన్నాయి. అయితే హార్ట్ ఎటాక్ అనేది చాలా మందికి బాత్రూమ్ లో ఉన్న సమయంలోనే వస్తూ ఉంటుంది. అంటే మలవిసర్జనకు వెళ్లినప్పుడు, లేదా స్నానం చేస్తున్న సమయంలో ఇలాంటప్పుడు ఎక్కువగా హార్ట్ ఎటాక్ వస్తూ ఉంటుంది. అయితే ఇలా బాత్ రూమ్ లో ఉన్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అలా ఎందుకు జరుగుతుంది అనేది చాలామంది ఆలోచించరు. అంతే కాకుండా వాటి గురించి సరైన అవగాహన కూడా ఉండదు.
హృద్రోగ వైద్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ రావడానికి గల ప్రధాన కారణం నీటి ఉష్ణోగ్రత లే. చలికాలంలో చల్లని నీటితో స్నానం చేయడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. చల్లని నీటితో తలస్నానం చేసినప్పుడు ఆ నీటిని తలపై పోసుకుంటే అప్పుడు శరీరంలో ఆ భాగం చల్లగా మారుతుంది. దీంతో సదరు రక్తనాళాలు వెంటనే అలర్ట్ అయ్యి రక్తాన్ని ఒక్కసారిగా పైకి పంపిస్తాయి. అయితే చల్లని నీటి వల్ల సహజంగానే రక్త నాళాలు కొద్దిగా కుచించుకుపోయినట్లు అవుతాయి.
దీనికి తోడు వాటిల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే అప్పుడు తల భాగం వైపు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సార్లు పక్షవాతం కూడా రావచ్చు. అందుకనే చల్లని నీటితో స్నానం చేసినప్పుడు ముందుగా తలపై కాకుండా పాదాలపై నీటిని పోసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక వేడి నీటితో స్నానం చేస్తే ఇలాంటి ఇబ్బంది రాదు. వేడి నీటి వల్ల రక్తనాళాలు కొంచెం వెడల్పుగా మారుతాయి.