4 Benz Cars For SumanTV CEO's: సినిమా హిట్ అయితే ఒక హీరో దర్శకుడికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్ మీడియా రంగంలో ఉద్యోగులకు బెంజ్ కార్ ఇచ్చిన ఘనత మాత్రం సుమన్ టీవీదే. ఒకరికి కాదు, ఏకంగా నలుగురికి బెంజ్ కార్లు ఇవ్వడం జరిగింది. ఈ సాంప్రదాయానికి తెరలేపింది మాత్రం సుమన్ టీవీనే.
ఒక సంస్థ ఎదగడం అంటే సంస్థను స్థాపించిన వ్యవస్థాపకుడు మాత్రమే ఎదగడం కాదు, సంస్థలో కష్టపడి పనిచేసే అందరూ ఎదగాలి అని కోరుకునే వ్యక్తి సుమన్ టీవీ ఛైర్మన్ సుమన్ దూది. సంస్థ స్థాపించినప్పటి నుంచి సంస్థ ఎదుగుదలకు కృషి చేసిన వారిని ఎప్పటికప్పుడు వృత్తిపరంగా, ఆర్థికంగా పైకి తీసుకొస్తూనే ఉన్నారు. ఇవాళ ఎంతోమంది సుమన్ టీవీ వల్ల బాగుపడ్డవారు, లాభపడ్డవారు ఉన్నారు. ప్రతిభ ఉంటే ఆఫీస్ బాయ్ అయినా సరే ఈ సుమన్ టీవీ సంస్థలో ఎదుగుతారు. చాలా తక్కువ జీతానికి చేరిన ఎంతోమంది ఇవాళ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వాళ్ళు అలా ఉన్నారంటే దానికి కారణం సుమన్ టీవీ విధానాలే.
ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ గా పేరు తెచ్చుకున్న సుమన్ టీవీ 8వ వార్షికోత్సవ వేడుకలు జూలై 2న అంగరంగ వైభవంగా జరిగాయి. సుమన్ టీవీ 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసి సీఈఓలుగా ప్రమోట్ చేశారు. నెలకు రూ. 5 లక్షల జీతం, కోటి రూపాయల ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ని ఇచ్చారు. ఇందులో నలుగురు సీఈఓలకు మాత్రం బెంజ్ కార్లను బహుమతిగా ఇచ్చారు సుమన్ టీవీ ఛైర్మన్. సుమన్ టీవీలో కష్టపడి పని చేసే ఉద్యోగులకు ఎప్పుడూ గుర్తింపు అనేది ఉంటుంది. ఈ క్రమంలోనే సుమన్ టీవీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నలుగురు ఉద్యోగులకు బెంజ్ కార్లు బహుమతిగా ఇచ్చారు.
అంతేకాదు వారిని ఒక్కో విభాగానికి ఒక్కో సీఈఓగా నియమించారు. ఉమెన్ వింగ్ సీఈఓగా జయలక్ష్మిని, సుమన్ టీవీ బిజినెస్ సీఈఓగా నాగరాజుని, సుమన్ టీవీ న్యూస్ సీఈఓగా నిరుపమని, ఎంటర్టైన్మెంట్ విభాగానికి సీఈఓగా రోషన్ ను, లైఫ్ స్టైల్ అండ్ భక్తి సీఈఓగా గీతాంజలి, సుమన్ టీవీ హెల్త్ సీఈఓగా సుదర్శన్ ను నియమించడం జరిగింది. అంతేకాదు లైఫ్ స్టైల్ అండ్ భక్తి వింగ్ కి వైస్ ప్రెసిడెంట్ గా నేతాజీని, సుమన్ టీవీ హెల్త్ వింగ్ కి వైస్ ప్రెసిడెంట్ గా ధనలక్ష్మిని నియమించడం జరిగింది. మొత్తం 8 మందికి ఉన్నతమైన ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పించడం జరిగింది. ఆరుగురు మంది ఉద్యోగుల ప్రతిభను, కష్టాన్ని గుర్తించి సీఈఓలుగా ప్రమోట్ చేయడమే కాకుండా నలుగురికి బెంజ్ కార్లు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. వీరంతా ఒక సాధారణ ఉద్యోగులుగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారే. ఇవాళ వీరి ప్రతిభను గుర్తించి సీఈఓ స్థాయికి తీసుకెళ్లడం నిజంగా గొప్ప విషయం. మీడియా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆ ఘనత సుమన్ టీవీకి.. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే సుమన్ కి చెల్లుతుంది.