ప్రస్తుతం వార్తా ప్రపంచంలో ఎన్నో వినూత్న మార్పులు వచ్చాయి. పలు ఛానల్స్ 24 గంటలు వార్తలు మన కళ్లముందు ఉంచుతున్నాయి. ఇప్పడు డిజిటల్ ఛానల్స్ హవా కొనసాగుతుంది.
డిజిటల్ మీడియా చరిత్రలోనే ఓ అద్భుతమైన ప్రయోగాన్ని సుసాధ్యం చేసి.. డిజిటర్ రంగంలో నంబర్ వన్ చానెల్‌గా కొనసాగేలా చేసి సుమన్ టీవి అధినేత సుమన్ దూదికి అరుదైన గౌరవం లభించింది. సుమన్ టీవీ స్థాపించినప్పటి నుంచి సంస్థ ఎదుగుదల కోసం ఆయన అహర్శిశలూ కష్టపడుతూ.. ఎప్పటికప్పుడు డిజిటల్ రంగంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ పోటీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి సుమన్ టీవీ తరుపు నుంచి సాయం చేస్తూ వస్తున్నారు. ఆగస్టు 6వ తేదీ నుంచి సింగపూర్ లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా టాప్ ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సత్యనాదేళ్ళ, శాంతను నారాయణతో పాటు సుమన్ టీవీ అధినేత సుమన్ దూది వారితో వేధికను పంచుకోనున్నారు.
వంద దేశాలకు పైగా వివిధ కేటగిరిలో ఎక్సలెన్సీ అవార్డు కోసం నామినేషన్ వేయగా.. వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ మాత్రం ఏకగ్రీవంగా సుమన్ టీవీ అధినేత సుమన్ దూదిని నామినేట్ చేసింది. డిజిటల్ మీడియాలో ఎనిదేళ్ల అద్భుత ప్రయాణంలో టెక్నాలజీని ప్రజలకు అనేక రూపాల్లో పరిచయం చేసిన లక్షల మందికి ఆదర్శంగా నిలిచిన సుమన్ టీవీ అధినేత సుమన్ దూదికి సింగపూర్ లో ఆగస్టు 6న ఎక్సలెన్సీ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ క్రమంలో వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ సందీప్ మర్యాదపూర్వకంగా సుమన్ దూదిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిజిటల్ మీడియాలో రంగంలో ఏనిమిదేళ్ల ప్రయాణానికి గాను సుమన్ దూదికి ఎక్సలెన్సీ అవార్డు ప్రధానం చేస్తున్నట్లు సందీప్ తెలిపారు.. అందుకు సంబంధించిన లెటర్ తో పాటు.. ఇన్విటేషన్ కూడా అందించారు. సుమన్ దూదికి ప్రముఖులు, పలు విభాగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.