సక్సెస్ ఎప్పుడూ ఊరికే రాదు. ఎన్నో కష్టాలు.. నష్టాలకు ఓడ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అండలేనిది ఈ కాలంలో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
కళను నమ్ముకున్న వాళ్లు.. కష్టాన్ని నమ్ముకున్నవాళ్లు ఎప్పుడూ నష్టపోరన్నది జగమెరిగిన సత్యం. చేతిలో కళ ఉన్నవారు కొంచెం అదృష్టం కలిసి వస్తే చాలు ఉన్నత శిఖరాలకు వెళ్లిపోతారు. అది ఏ కళ అయినా కావచ్చు.. అందరిలా కాకుండా కొంచెం భిన్నంగా చేస్తే చాలు సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మొదట్లో కష్టాలు పడ్డా..చివరకు విజయం సాధించటం పక్కా. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని.. అనుకున్నది సాధించి.. అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నవారు మన సమాజంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో లక్ష్మీ శిరీష ఒకరు. మొదట్లో ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫేయిల్ అయ్యారు. తర్వాత అదే యూట్యూబ్‌ను నమ్ముకుని సక్సెస్ సాధించారు. తన చేతిరాతను భవిష్యత్తుగా మలుచుకున్నారు. చేతి రాతతో తలరాతను మార్చుకుని లక్షలు సంపాదిస్తున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మి శిరీషకు 2014లో భరత్ భూషణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అతడు బ్యాంకు ఉద్యోగి. శిరీషకు కూడా ఉద్యోగం చేయాలని కోరికగా ఉండేది. ఆ ప్రయత్నంలో ఉండగానే గర్భం దాల్చింది. పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఆసక్తి తగ్గిపోయింది. పిల్లలను చూసుకుంటున్న క్రమంలోనే ఆమెకు చేతి వృత్తులపై ఆసక్తి పెరిగింది. దీంతో యూట్యూబ్‌లో క్లాసులు వింటూ.. నాతిచరామి అనే సంస్థను ప్రారంభించింది. పెళ్లిళ్లకు సంబంధించిన వస్తువులను తయారు చేసి అమ్మేది. ఆ తర్వాత ఫసీ, మెసీ అనే యూట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేసింది. అది కాస్తా దారుణంగా బెడిసి కొట్టింది.
అయినా ఆమె కృంగిపోలేదు. ఏదైనా సాధించాలన్న కసితో ఉండేది. ఈ నేపథ్యంలోనే చేతిరాతపైకి ఆమె ఆసక్తి వెళ్లింది. తన పాపకు చేతిరాతను నేర్పడానికి.. మూడు నెలలు నెట్ లో వెతికి స్వయంగా నేర్చుకుంది. ఇదే తర్వాతి కాలంలో ఆమె వ్యాపారంగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె 13 మందికి ఉపాధి కల్పిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్యాంకాక్ .. ఇలా 9 దేశాల్లోని విద్యార్థులకు ఆమె ట్యూషన్లు చెబుతున్నారు. దాదాపు 5 వేల మందికి శిరీష శిక్షణ ఇచ్చారు. శిరీష తన చేతిరాతతో ప్రస్తుతం లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు.
అయితే, ఆమె ఈ సక్సెస్ సాధించటానికి సోషల్ మీడియా తోడ్పడింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సక్సెస్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సక్సెస్ రావటానికి చాలా సమయం పట్టింది. సోషల్ మీడియాలో ప్రమోషన్ ఎలా చేసుకోవాలో ఆమెకు మెలుకువలు తెలిసి ఉంటే ఈ సక్సెస్ ఇంకా త్వరగా వచ్చేది. మరి, మీరు కూడా లక్ష్మీ శిరీషలాగా కళను నమ్ముకుని సక్సెస్ సాధించాలని భావిస్తున్నారా?.. సోషల్ మీడియాలో మీ ఆర్ట్‌ను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే, మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్‌ఫుల్ జర్నీ ఇన్‌పుట్స్‌తో మీ కందిస్తున్నారు.. యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ సక్సెస్‌కు బాటలు వేస్తుంది.
యూట్యూబ్ మాస్టర్ కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.