ఫ్రెండ్ షిప్ డే వచ్చేసింది. ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్స్ తో సోషల్ మీడియా అంతా ఫ్రెండ్ షిప్ డే కోట్స్ తో మోతమోగిపోతుంది. ఫ్రెండ్స్ కి మంచి ఫ్రెండ్ షిప్ డే కోట్స్ పంపించి తమ సంతోషాన్ని మిత్రులతో ఉంటారు. మరి మీ స్నేహితులను విష్ చేయడానికి బెస్ట్ కోట్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.
రక్త సంబంధం కాదు, పేగు తెంచుకుని పుట్టిన తోబుట్టువు అంతకంటే కాదు.. బంధువు కాదు, ఏ బంధమూ కాదు. కానీ ఈ బంధాల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలిగే బంధమే స్నేహం. ఒరేయ్ నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని కమాండ్ చేసేది రక్త సంబంధం అయితే.. నువ్వు ఇలా ఉంటేనే నీ లైఫ్ లోకి వస్తాను అనేది వైవాహిక బంధం అయితే.. నువ్వు బాగుంటేనే నీ ఇంటికొస్తా, నీ ముఖం చూస్తా అని అనేది బంధుత్వం అయితే.. అసలు నువ్వెలా ఉన్నా పర్లేదు.. నువ్వు కళ్ళ ముందు ఉంటే చాలు అని అనేది స్నేహ బంధం మాత్రమే. స్వార్థం అనే పదాన్ని భూతద్దం వేసి మరీ వెతికినా దొరకనటువంటి అద్భుతమైన వ్యక్తి ఫ్రెండ్. మీ జీవితంలో మీకు దొరికిన అద్భుతమైన ఫ్రెండ్స్ కి ది బెస్ట్ కోట్స్ వారికి పంపించి ఈ ఫ్రెండ్ షిప్ డేని సెలబ్రేట్ చేసుకోండి.