ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే. ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే.. అంటూ పాటలు పాడుకునే రోజు వచ్చింది. ప్రతి ఒక్కరూ మన ఫ్రెండల్లే ఇంకెవరుంటారు అని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అలాంటి ఫ్రెండ్ గురించి చెప్పమంటే ఏం చెబుతారు?
Disclaimer:
స్నేహితులు లేకపోవడం ఆరోగ్యానికి హానికరం.
Not having friends can be dangerous to your health, causes loneliness.
Let us raise the Facebook wall in favor of friendship day.
జీవితంలో వచ్చే సమస్యలను ఫేస్ చేయాలంటే ఒక ఫ్రెండ్ ఉండాలి.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి మిత్రుడ్ని పట్టుకో. ఎందుకంటే, ఫ్రెండ్ ను మించిన పుస్తకం లేదు. ఫ్రెండ్ ను మించిన బైబిలు లేదు, ఫ్రెండ్ ను మించిన ఖురాన్ లేదు, ఫ్రెండ్ ను మించిన రామాయణ, మహాభారతాలు లేవు. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. బ్లడ్ రిలేషన్ లేకపోయినా, బెడ్(బెంచ్) రిలేషన్ కారణంగా బ్లడ్ రిలేటివ్ లా, ఫెవిక్విక్ లా ఎప్పుడూ అతుక్కుని ఉండే ఏకైక రిలేటివ్ ఫ్రెండ్. అప్పటి వరకూ జీవితం పట్ల ఎలాంటి క్లారిటీ రానిది, కేవలం ఒకే ఒక్క ఫ్రెండ్ పరిచయమయ్యాక వస్తుంది. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే జీవితం మీద క్లారిటీ వస్తుంది. అందుకే ఫ్రెండ్ ఎప్పుడూ గొప్పే, ఫ్రెండ్ షిప్ ఎప్పుడూ గొప్పే.
డబ్బు సాయం అడిగితే ఎందుకు అని అడక్కుండా ఎంత అని అడిగేవాడు ఫ్రెండ్. బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడకి అని అడక్కుండా ఎక్కడికైనా వస్తాను పదా అనేవాడు ఫ్రెండ్. తల్లిదండ్రులు జన్మనిస్తారు, జీవితాన్నిస్తారు. కానీ ఆ జీవితాన్ని నిలబెట్టుకునేందుకు స్నేహితులు అండగా నిలబడతారు. ప్రతీ ఒక్కరికీ ఒక బెస్ట్ బిగ్గెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. నీళ్ళు లేని సముద్రాన్ని చూడగలమేమో గాని ఫ్రెండ్ లేని మనిషిని చూడలేము. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ కనీసం ఒక్క ఫ్రెండ్ అయినా ఉంటారు. పడవ, ఓడ లాంటివి లేకుండా సముద్రాన్ని ఎలా దాటలేమో, ఒక ఫ్రెండ్ లేకుండా జీవితమనే ఈ ప్రయాణాన్ని దాటలేము. ఉప్పు లేని కూర ఎంత చప్పగా ఉంటుందో, ఫ్రెండ్ లేని జీవితం కూడా అంతే చప్పగా ఉంటుంది.
అమ్మా, నాన్న లేకుండా జీవితం గడిపేసే వాళ్ళు ఉండచ్చు, భార్యా/భర్త లేకుండా జీవితం గడిపేసే వాళ్ళు ఉండచ్చు. కానీ స్నేహితులు లేకుండా జీవితం గడిపే వాళ్ళు ఉండరు. ప్రతీ ఒకరి జీవితంలోనూ, ఏదో ఒక సందర్భంలో సరైన స్నేహితులు తగులుతారు. కష్టాల ఊబిలో కూరుకుపోయిన క్షణంలో చేయి ఇచ్చి పైకి లాగుతారు. చేయూతనిచ్చి అండగా నిలబడతారు, ఫ్రెండ్ ని అందనంత ఎత్తులో నిలబెడతారు. నీ నుంచి డబ్బు వద్దు, నా గురించి కానీ, నేను చేసిన సాయం గురించి కానీ చెప్పద్దు, నువ్వు సక్సెస్ అయితే చూడాలనుంది అంటూ స్వార్ధం, అసూయ లేని ప్రాణ స్నేహితులుంటారు.
ఎన్నేళ్ళు అయినా ప్రేమించిన వారిని, ప్రేమించిన వారి రోల్ నంబర్ ని, ఫోన్ నంబర్ ని ఎలా అయితే మర్చిపోమో, అలానే స్నేహించిన వారి రోల్ నంబర్ ని, ఫోన్ నంబర్ ని, వాళ్ళ స్నేహాన్ని మర్చిపోలేం. ప్రేమించిన వారి పేరు యూజర్ నేమ్ గా, ప్రేమించిన వారి రోల్ నంబర్ పాస్ వర్డ్ గా పెట్టుకునే సాంప్రదాయం స్నేహితుల నుంచే మొదలవుతుంది. మనకి మన స్నేహితులే రోల్ మోడల్. వాళ్ళే మన జీవితమనే కధకి హీరో/హీరోయిన్.
ఎన్నో విషయాలు నేర్పుతారు, జీవిత సత్యం చెప్తారు. చదువులోనే కాకుండా అన్ని విషయాల్లోనూ అవగాహన కల్పించేది ఒక ఫ్రెండ్ మాత్రమే. గూగుల్ కి కూడా తెలియని నిజాలు, గూగుల్ లో వెతికినా దొరకని నీతులు, బూతులు మన ఫ్రెండ్ కి మాత్రమే తెలుస్తాయి, ఫ్రెండ్ దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఫ్రెండ్ ఒక ఆక్స్ ఫార్డ్ డిక్షనరీ. బూతులు వెతుక్కోవచ్చు, నీతులు వెతుక్కోవచ్చు. ఛాయిస్ ఈజ్ అవర్స్. బూతులైనా, నీతులైనా ఎప్పుడు, ఎక్కడ యూజ్ చేయాలో చెప్పేది ఒక ఫ్రెండ్ మాత్రమే. స్నేహితులెప్పుడూ ట్రెండ్ సెట్టర్లే. అందుకే స్నేహితులు గొప్పవాళ్ళు. స్నేహం గొప్పది.
స్నేహం గురించి చెప్పడం మొదలుపెడితే భారతం అవుతుంది, రాయడం మొదలుపెడితే రామాయణం అవుతుంది. ఎందుకంటే పురాణ గ్రంథాల్లో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఫ్రెండ్‌లో ఉన్నాయి కాబట్టి. శతృవు ఎంత పెద్దోడైనా.. ఫ్రెండ్ వైపు ధర్మం ఉంటే న్యాయం చేసే రాముడవుతాడు. ఆపదొస్తే అర్జునుడి కోసం అండగా నిలబడే కృష్ణుడవుతాడు, స్నేహం కోసం ప్రాణాలనైనా త్యాగం చేసే కర్ణుడవుతాడు. మనలో ఉన్న కంసుడనే చెడుని కృష్ణుడై సంహరిస్తాడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు జీవిత సత్యాన్ని బోధిస్తాడు.
ఏదో ఒక సంవత్సరంలో మీ స్నేహం మొదలై ఉంటుంది. ఇంకా ఇప్పటికీ కొనసాగుతూ ఉందంటే మీరు నిజంగా అదృష్టవంతులే. స్నేహం అంటే ఇదే అని ఒక అవగాహన వచ్చే లోపు ఉద్యోగం, బాధ్యత, పెళ్లి అంటూ రకరకాల ఎమోషన్స్ వల్ల ఫ్రెండ్స్ కి దూరమవుతున్నట్టు అనిపిస్తుంటుంది, కానీ నిజానికి దూరమయ్యేది ఫిజికల్ గానే, మెంటల్ గా కాదు. సరిహద్దులు లేని స్నేహం ఫ్రెండ్స్ ది. ఫ్రెండ్ కి ఆపదొస్తే ఆ ఆపదకే అడ్డంగా నిలబడతాడు. ఆపదైనా సరే తనని దాటుకుని వెళ్లాలని చెప్తాడు. కానీ దాన్ని దాటనివ్వని వాడే ఫ్రెండ్. మరి మీ జీవితంలో మీరు పొందిన గొప్ప స్నేహితులను, ఫ్రెండ్ తో మీరు గడిపిన జ్ఞాపకాలను కామెంట్ చేయండి.
ప్రతీ ఒక్కరికీ స్నేహితుల 🫂 దినోత్సవ శుభాకాంక్షలు 💐