తల్లిదండ్రులు పిల్లలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని కలలు కంటుంటే.. కొంతమంది పిల్లలు మాత్రం వారి కళ్ళలో కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
చిన్న చిన్న జీవితాలు. తండ్రి తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. అమ్మ మాజీ సర్పంచ్ గా పని చేసింది. వీరికొక కూతురు ఉంది. రోజూ కాలేజ్ కి వెళ్ళొచ్చేది. అంతా బాగానే ఉందనుకుంటే సడన్ గా ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. తల్లిదండ్రులకు కాళ్ళూ, చేతులూ ఆడలేదు. ఒళ్ళంతా హూనం చేసుకుని పైసా పైసా కూడబెట్టి పిల్లల్ని చదివిస్తే ఇదా తల్లిదండ్రులకు ఇచ్చే ప్రతిఫలం. తమ కూతురు బాగా చదువుకుని పెద్ద నర్స్ అవుతుందని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు ఒక పీడ కలను పరిచయం చేసి వెళ్ళిపోయింది. ప్రేమ ఫెయిలైందనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో చిన్న చిన్న కారణాలతో తల్లిదండ్రులను ఒంటరి వాళ్ళను చేసి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో నాయక్కనూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ (48) తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఈయన భార్య తమిళరసి పంచాయితీ మాజీ సర్పంచ్. వీరి కుమార్తె దమయంతి (19) కృష్ణగిరిలో ఉన్న ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దమయంతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సింగారపేట పోలీసులు అక్కడకు అమ్మాయి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు, బంధువులు అమ్మాయి చనిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసుల విచారణలో దమయంతి అదే గ్రామానికి చెందిన శ్రీనాథ్ (25) అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు తేలింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అమ్మాయిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని శ్రీనాథ్ ను అరెస్టు చేయాలనీ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు శ్రీనాథ్ ను అరెస్ట్ చేశారు. ప్రేమ, ఆకర్షణ రెండిటికీ తేడా తెలియని వయసులో ప్రేమించడం మొదలు పెడతారు. అవతలి వ్యక్తి కాదన్నా ఆత్మహత్యే, ప్రేమ పేరుతో వేధించినా ఆత్మహత్యే. ఇక వేరే ఆలోచన లేదు. ప్రేమ లేకపోతే బతకలేమని అనుకుంటారు. ప్రేమ పేరుతో వేధిస్తే ప్రేమని చంపేయాలి గానీ ప్రాణం తీసుకోవడం ఎంత వరకూ కరెక్ట్.. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.