సాధారణంగా కొంతమంది మహిళలు బట్టల షాపు, నగల షాపుల్లో తమ చేతివాటం చూపిస్తుంటారు. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలు చేస్తూ మెల్లిగా అక్కడ నుంచి జారుకుంటారు. లెక్కల్లో తేడా వచ్చి షాపు యజమానులు లబో దిబో అంటుంటారు. ఇలా మహిళలు చేతివాటం చూపిస్తున్న సమయంలో సీసీ కెమెరాల్లో కనిపిస్తూ అడ్డంగా బుక్కయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఓ మహిళ నగల షాపు లో చుట్టు మనుషులు ఉన్నా.. గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికీ అనుమానం రాకుండా నక్లెస్ కొట్టేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గోరఖ్ పూర్ లో బల్ దేవ్ ప్లాజాలో ఉన్న ఓ నగల షాపు కి ఓ నడి వయసు గల మహిళ ఈ నెల 17న వెళ్లింది. షాపు సిబ్బంది ఆమె వద్దకు వచ్చి ఎలాంటి నగలు కావాలని అడిగారు.. తనకు ఖరీదైన నక్లెస్ చూపించాలని కోరింది. వారు కొన్ని డిజైన్లు ఆమె వద్దకు తీసుకు వచ్చి చూపించారు.. ఈ లోగా వేరే కస్టమర్లు రావడంతో వారితో మాట్లాడుతున్న సమయంలో మెల్లిగా ఒక బాక్సు తన ఒడిలో దాచింది.. ఆ తర్వాత నగను బాక్సు తో సహ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త చేసుకొని తనకు నగలు నచ్చడం లేదని వెళ్లిపోయింది.
నగల షాపు లో సాయంత్రానికి లెక్కలో తేడా రావడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించారు షాపు యజమాని. మొదట షాపు సిబ్బందిపై అనుమానం వచ్చినప్పటికీ సీసీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ మహిళ నగల బాక్సు తన బట్టల్లో దాచుకొని తీసుకు వెళ్లడం గమనించారు.. దాని ఖరీదు రూ.10 లక్షల వరకు ఉంటుందని షాపు యజమాని అంటున్నారు. వెంటనే ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Lady Theft Jewellery in Gold Shop in Gorakhpur | Worth of Rs.10 Lakh | pic.twitter.com/OApXul4uIv
— ETV Andhra Pradesh (@etvandhraprades) November 26, 2022