Dowry Harassment: భర్త అంటే భరించేవాడు అని అర్ధం. వైవాహిక జీవితంలో ఎన్ని కష్టాలున్నా గానీ ఓపికతో భరించాలి. అంతేగానీ కష్టాలు వచ్చాయి కదా అని భార్యని వేధించకూడదు. ఒకసారి కట్నం అడిగిన వారిని గాడిద అంటారు. మరి పదే పదే అదనపు కట్నం అడిగేవారిని ఏమనాలి? కట్నం అడగడం, కట్నం పేరుతో ఆడవాళ్ళని వేధించడం నేరమని ఎంత చెప్పినా కొంతమంది మారడం లేదు. అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి, జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పిన భర్తే.. భార్య పాలిట శాపంగా మారాడు. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, తన ఫ్రెండ్‌తో గడపమని ఆదేశించాడు. ఇక వేరే దారి లేక ఆ అభాగ్యురాలు పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి(35) 2016లో ఈ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్ళి సమయంలో కట్నం కింద రూ. 5 లక్షల నగదు, 9 తులాల బంగారం, లక్షల విలువైన ఇంటి సామాను గట్రా పెట్టారు. అయితే పెళ్ళయిన కొన్నాళ్లకు చేస్తున్న వ్యాపారం బంద్ చేసేసి జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. చేతిలో రూపాయలు లేకపోవడంతో భార్యను పుట్టింటికి వెళ్ళి అదనపు కట్నం తీసుకురమ్మని వేధించడం స్టార్ట్ చేశాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో భార్యకు తెలియకుండా.. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియాలో ఫ్రెండ్‌కు పంపించాడు. ఆ సంగతి తెలిసిన మహిళ భర్తను నిలదీసింది.
దానికి ఆమె భర్త.. “కట్నమైనా తీసుకురా.. లేదా నా ఫ్రెండ్‌తో అయినా గడుపు” అంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆ ఒత్తిడి భరించలేక అత్తమామలకు చెప్పింది. అయితే వాళ్ళు కూడా తమ కొడుక్కే సపోర్ట్ చేశారు. అదనపు కట్నం తెమ్మని ఒత్తిడి తెచ్చారు. ఆమె నిరాకరించడంతో ఆమె మీద అత్తమామలు చేయి చేసుకున్నారు. దీంతో ఆమె శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె భర్త, అత్తమామలతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి అదనపు కట్నం కోసం భార్యను స్నేహితుడితో గడపనన్న ఈ నీచ భర్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.