మనిషి జీవితం క్షణకాలం. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఈ క్షణం సంతోషంగా ఉన్న వ్యక్తి.. నిమిషాల వ్యవధిలో మృత్యువాత పడవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో మన దేశంలో కార్డియక్ అరెస్ట్‌తో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతేడాది అక్టోబర్‌లో ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ వ్యాయామం చేస్తూ కన్ను మూసిన సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ కారణంగా పునీత మృతి చెందాడు. ఈ తరహా సంఘటన ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. వ్యాయామం చేస్తూ ఓ స్టాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. పెళ్లై రెండు నెలలైనా కాక ముందే భర్త కన్నుమూయటంతో ఆ కొత్తపెళ్ళి కూతురు రోదన వర్ణనాతీతంగా ఉంది. ఆ వివరాలు…
పుంగనూరుకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుధాకర రెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తేజ విష్ణువర్ధన్ రెడ్డి(27) బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి రెండు నెలల క్రితం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లావణ్యతో వివాహం అయ్యింది. ఆమె కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆషాఢమాసం కాబట్టి లావణ్య కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. ప్రతిరోజు వ్యాయమం చేసే విష్ణు వర్ధన్ రెడ్డి రోజు మాదిరిగా ఆదివారం ఉదయం గ్రామంలో సైక్లింగ్ చేస్తున్నాడు. కొంతదూరం వెళ్లాక సైకిల్ మీద నుంచి కుప్పకూలి పడిపోయాడు. కుమారుడు పడిపోయాడని తెలుసుకున్న సుధాకర రెడ్డి ఈవిషయాన్ని గ్రామంలోని డాక్టర్ చైతన్య రెడ్డికి సమాచారం ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: Guntur Crime News: కోరుకున్న ఉద్యోగంలో చేరే ఒక్కరోజు ముందు యువతి ఆత్మహత్య
ఇద్దరూ ఘటనా స్ధలం వద్దకు వచ్చారు. విష్ణును పరీక్షించిన డాక్టర్ గుండెపోటుతో మరణించినట్లు చెప్పారు. భర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న లావణ్య గ్రామానికి చేరుకుని మృతదేహం చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆషాఢ మాసం పూర్తైన తర్వాత తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లేందుకు కొత్త జంట ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇంతలోనే ఘటన జరగటంతో అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ విషాద సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Mysuru: జుట్టు రాలిపోతుందని ఆత్మహత్య చేసుకున్న యువతి!