సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమాని అందరూ చూసే ఉంటారు. ఆ మూవీలో సత్యదేవ్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది. ప్రజలను మోసం చేసే వ్యక్తిగా సత్యదేవ్ జీవించేశాడు. ఆ మూవీలో అతను చేసే మోసాల్లో రైస్ పుల్లింగ్ యంత్రం కూడా ఒకటి. ఇప్పుడు రియల్ లైఫ్‌లో అలాంటి ట్రిక్‌తో ప్రజలను మోసం చేస్తున్న ఒక ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని ఒకటో పట్టణ సీసీఎస్ పోలీసులు ఓ ముఠాను అరెస్టు చేశారు. అమితమైన శక్తి గల పురాతన వస్తువులు తమ దగ్గర ఉన్నాయంటూ స్థానికులను మోసం చేస్తున్నారు. పోలీసులు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ రైస్ పుల్లింగ్ యంత్రాలు, రెండు రాగి నాణేలు స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరులోని జెండా వీధికి చెందిన షేక్ మైనుద్దీన్ వెండి దుకాణం పెట్టి నష్టపోయాడు. నంద్యాల జిల్లా బేతంచర్లకు చెందిన సయ్యద్ మహ్మద్, బనగానపల్లి మండలానికి చెందిన అబ్దుల్ రసూల్‌తో కలిసి రైస్ పుల్లింగ్ మోసాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే మైనుద్దీన్ ఒక గిన్నెకు దేవుడి ప్రతిమలు, లోపల వినాయకుడి విగ్రహం, మధ్యలో ట్రాన్స్‌పరెంట్ రాయిని ఉంచాడు.
గిన్నె అడుగున బ్యాటరీల సాయంతో నీళ్లు పోస్తే రాయి రంగులు మారేలా ప్లాన్ చేశాడు. ఉదయం వాకింగ్ కు వెళ్లే వారికి ఇవి పురాతన వస్తువులని.. శక్తివంతమైనవంటూ మోసాలు చేయసాగారు. తెల్లవారుజామున విధులు నిర్వహిస్తున్న పోలీసులు వీరిపై అనుమానంతో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.