ఈ మధ్యకాలంలో నిత్య పెళ్లికొడుకుల వ్యవహారాలు రోజుకొకటి బయటకి వస్తున్నాయి. గతంలో శివ శంకర్ అనే వ్యక్తి 11కు పెళ్లిలు చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన మరిచిపోక ముందే గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు చెందిన కర్నాటి సతీష్ బాబు అనే మరొక నిత్య పెళ్లికొడుకు వ్యవహారం బయటకి వచ్చింది. ఇతడు ఎన్నారై, అమెరికాలో ఉంటూ చాలా మంది మహిళలను మోసం చేప్తున్నారు. తాజాగా ఐదో భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అసలు విషయం బయటకి వచ్చింది. సతీష్ ను, అతడి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే సతీష్ పెళ్లిళ్ల వ్యవహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్నాటి సతీష్ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి. అతడి తండ్రి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సతీష్ పనిచేస్తున్నాడు. అమెరికాలో ఉన్నట్లు చెప్పి పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో ఎన్నారై సతీష్ పారిపోయేవాడు. ఇలా ఏడాదికో పెళ్లి చేసుకుని ఆ తరువాత విడాకులివ్వడం చేస్తుండే వాడు. అలా శ్రీలక్ష్మి అనే యువతి కూడా పెళ్లి చేసుకున్నాడు. అతడి ప్రవర్తనపై శ్రీలక్ష్మి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అతడి ఫోన్ పరిశీలించగా అతడి ఐదు పెళ్లిళ్ల బాగోతం బయటపడింది. సతీష ఐదో భార్య శ్రీలక్ష్మి మాట్లాడుతూ..”నాకు సతీష్ తో 2022 జూన్ లో విజయవాడలోని లంబిపేటలోని శ్రీవెంటేశ్వర స్వామి కళ్యాణ మండపంవలో జరిగింది. అయితే ఆయన పెళ్లిల వ్యవహారం జూలైలో తెలిసింది. అప్పుడే అతని రెండో పెళ్లి విషయం నాకు మొదటసారి తెలిసింది. లావణ్య కర్నాటి అనే అమ్మాయితో అతను జరిపిన వాట్సాప్ సంభాషణలు చూడటం వలన నాకు తెలిసింది.
తన గట్టిగా నిలదీయడంతో అక్క.. అవుతుందని బుకాయించాడు. కానీ నేను ఆధారలతో సహా చూపించే సరికి ఆమెను తను రెండో వివాహం చేసుకున్నట్లు సతీష్ ఒప్పుకున్నాడు. అతడి తల్లిదండ్రులను నిలదీయగా వారికి కూడా అతడి పెళ్లిల గురించి తెలుసని తెలిపారు. ఇంకా సతీష్ పై అనుమానంతో అతడి వ్యహహారం గురించి లోతుగా పరిశీలించగా మిగిలిన పెళ్లిళ వ్యవహారం కూడా తెలిసింది. నాకు తెలిసినంత వరకు నాతో కలిపి సతీష్ ఐదు పెళ్లి చేసుకున్నాడు. మధ్యలో ఇంకా పెళ్లిళ్లు చేసుకుని ఉండోచ్చు. పోలీసులే విచారించే తెలపాలి” అని శ్రీలక్ష్మి అన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు కర్నాటి సతీష్ బాబు అతని తండ్రి వీరభద్రరావులను అరెస్టు చేశారు. పోలీసులు నిందితులిద్దరినీ కోర్టులో హాజరు పరిచారు.గతంలో పెళ్లిళ్లు జరిగిన విషయం దాచిపెట్టి మోసం చేశాడని ఐదో భార్య శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సతీష్ బాబుపై ఇప్పటికే ఇద్దరు భార్యలు కేసు పెట్టారని పోలీసులు తెలిపారు. మరి.. సతీష వ్యవహారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.