‘డబ్బు’.. అది లేకుంటే మనల్ని ఎవరు పట్టించుకోరు.. రా? మనం బ్రతకాలన్నా, సమాజంలో గౌరవం దక్కాలన్నా డబ్బే కావాలి.. ఇవి నిత్యం మనం ఇళ్లలో వినే మాటలే. మరి డబ్బుకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? జీవితంలో డబ్బే ముఖ్యమా?. డబ్బు లేకుంటే జీవితం వృధానా?.
గతంలో.. ‘మనం, మనది’ అనే భావనతో మనుషులు మెలిగేవారు. ధనం కేవలం బ్రతకడం కోసమే అని భావించేవారు. గతంలో మన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరికైనా సమస్య వస్తే అందరూ కలిసి ఆ సమస్య పరిష్కారం కోసం తమ వంతుగా సహాయం చేసేవారు. కానీ, కాలం మారింది. మనుషుల జీవన విధానం కూడా పలు మార్పులొచ్చాయి. మనుషుల ఆలోచనల్లో, ప్రవర్తనలో అనేక మార్పులు వస్తున్నాయి. స్వార్థం అంతకంతకూ పెరుగుతోంది. మానవ బంధాలు మరిచి డబ్బుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డబ్బు ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్లేననే భావనలో బ్రతుకుతున్నారు. నిజ చెప్పాలంటే.. సిగ్గు విడిచి మరీ డబ్బులు సంపాదిస్తున్నారు. మరి డబ్బు లేకుంటే జీవితం వృధానా? డబ్బు గురుంచి.. మన గెస్ట్ ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే..
ఇది కూడా చదవండి: Sneha Sirivara: లక్ష జీతం వచ్చే జాబ్ వదిలేసి.. చిన్న ఆలోచనతో నెలకు 5 లక్షలు సంపాదిస్తోంది!