‘డబ్బు’.. అది లేకుంటే మనల్ని ఎవరు పట్టించుకోరు.. రా? మనం బ్రతకాలన్నా, సమాజంలో గౌరవం దక్కాలన్నా డబ్బే కావాలి.. ఇవి నిత్యం మనం ఇళ్లలో వినే మాటలే. మరి డబ్బుకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? జీవితంలో డబ్బే ముఖ్యమా?. డబ్బు లేకుంటే జీవితం వృధానా?. గతంలో.. ‘మనం, మనది’ అనే భావనతో మనుషులు మెలిగేవారు. ధనం కేవలం బ్రతకడం కోసమే అని భావించేవారు. గతంలో మన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరికైనా సమస్య వస్తే అందరూ […]
పేరు ఇర్ఫాన్. మరో ముగ్గురి సహాయంతో అతను భారీ దోపిడీలు చేస్తుంటాడు. అతడి మీద వివిధ రాష్ట్రాలలో డజనుకు పైగా కేసులున్నాయి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇర్ఫాన్‌కు మొత్తం పది మంది భార్యలు. వారిని వివిధ నగరాల్లో ఉంచాడు. ఓ భార్య పేరు మీద అత్యంత ఖరీదైన జాగ్వర్ కారు కొన్నాడు. అతడు ఎక్కడికి వెళ్లినా ఫైవ్ స్టార్ హోటల్ లోనే బస చేసి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అయితే ఇండియాలో ప్రతీ రాష్ట్రంలో అతడికి […]
మనలో కొంత మందికి పాము చూస్తే చాలు భయంతో దూరంగా పరిగెడుతారు. మరికొందరు అయితే కర్రతో అందుకొని దాని ఊపిరి తీసేవాళ్లుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగుపాముకు నోటితో ఆక్సిజన్ అందించి దాని ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలోని నువాగూడ షాహీలో ఓ వ్యక్తి ఇంట్లోకి నాగుపాము కనబడింది. దీంతో అతడు వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. జిల్లాకు చెందిన […]
చందానగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులకు మూడేళ్ల క్రితం అయాన్ష్ గుప్తా జన్మించాడు. శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకికి చూపించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడు పుట్టుకతోనే అరుదైన వెన్నెముక సంబంధిత సమస్య (స్పైనల్ మసు్కలర్ ఆట్రోఫీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. చికిత్స చాలా ఖరీదుతో కూడినది కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వైద్యుల సలహా మేరకు ఆన్‌లైన్ వేదికగా విరాళాలు సేకరించే ఇంపాక్ట్ గురు స్వచ్ఛంద సంస్థను […]
‘ఆన్‌లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ ఆశాదీపం. ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలకు సంబంధించో చికిత్స కోసం ఎంతోమంది బాధితులు, వారి కుటుంబసభ్యులు తమ వద్ద అందుబాటులో ఉన్న, అప్పటి వరకూ పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తున్నారు. బీమా సదుపాయం వంటివీ వినియోగిస్తున్నారు. కొంతమంది ఆస్తులూ అమ్ముకుంటున్నారు. అయినా ఇంకా చికిత్సకు లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తే దిక్కుతోచని స్థితే. కొందరైతే అప్పులు తెచ్చి చికిత్స చేయించుకుంటున్నా కోలుకున్నాక ఆ రుణం తీర్చలేక అవస్థలు […]
కరోనా వైరస్ వణికిస్తుంటే ఇప్పుడు మరింత భయపెట్టేందుకు బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అని పిలిచే ఈ ఇన్‌ఫెక్షన్ తాలూకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఫంగస్ కారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు కోల్పోవడం.. మరికొందరు అయితే ప్రాణాలను కోల్పోవడం ఇప్పుడు అందోళన కలిగిస్తుంది. మ్యుకర్ మైకోసిస్ ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతోంది. అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ కరోనా సోకిన వారిలో, […]
కరోనా వైరస్ పుణ్యమా అంటూ ప్రజలకు కొత్తగా పరిచయమైన లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఒక అంశాన్ని తీసుకుని పూర్తిగా అవగాహన కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ‘పూరి మ్యూజింగ్స్‘ అనే పేరుతో విభిన్న అంశాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. మనకున్న జీవన నైపుణ్యాలని తెలుసుకోవడం కోసం మనకి మనమే ఓ అగ్నిపరీక్ష పెట్టుకొని ఒంటరిగా బయలుదేరి వెళ్లి అడవిలో ఒక్కడివే బతకడం […]
అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం. కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే […]
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య లక్షల్లో ఉండగా కరోనా కారణంగా మృతి చెందేవారి సంఖ్య వేలలో ఉంటుంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కరోనా మానవత్వాన్ని మంట కలిపెస్తోంది. కరోనా బంధాలను చిదిమేస్తోంది. కరోనా మానవత్వాన్ని మంట కలిపెస్తోంది. బంధాలను తెంచేస్తోంది. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కొవిడ్ సోకిందని కన్నతల్లిని కుమార్తెలు చెట్టుకింద […]