బ్లూ టిక్ కావాలా, అయితే డబ్బులు కట్టాల్సిందే. బ్లూ టిక్ ఏంటి? అని అడిగారనుకోండి, ఊరికే ఇచ్చేస్తారేంటి టిక్కు, నెల నెలా అమౌంట్ పే చేయాలి. లేదంటే టిక్కు తీసేస్తామని ఎలాన్ మస్క్ హింట్ ఇచ్చారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ పేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఖాతాలు ఉండడం అనేది సహజమే. అయితే ఈ డిజిటల్ సొసైటీలో సెలబ్రిటీల నుంచి సామాన్యులని వేరు చేసేదే బ్లూ టిక్. బ్లూ టిక్ అనేది లేకపోతే ఎవరు డూపో, ఎవరు ఒరిజినల్లో అనేది తెలియదు. సెలబ్రిటీల ఖాతాల మీద కొన్ని వందల, వేల నకిలీ ఖాతాలు ఉన్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ వచ్చిన మొదట్లో అయితే బ్లూ టిక్ అనేది లేనే లేదు. దీంతో సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి పెంట పెంట చేశారు చాలా మంది. ఇలాంటి దరిద్రాలు ఉండకూడదనే బ్లూ టిక్ ఆప్షన్ ని తీసుకొచ్చారు.
మొదట ఈ బ్లూ టిక్ ఆప్షన్ ని ట్విట్టర్ 2009లో తీసుకొచ్చింది. అసలు మొదట్లో ట్విట్టర్ ను ఎక్కువగా వాడిందే సెలబ్రిటీలు. వారి కోసమే అన్నట్టు ఉండేది. రాను రాను ట్విట్టర్ యూజర్స్ పెరిగిపోవడంతో అసలెవరో, నకిలీ ఎవరో తెలిసేది కాదు. అందుకే జెన్యూన్ అకౌంట్లను వెరిఫై చేసి బ్లూ టిక్ ఇచ్చేది. దీన్ని చూసి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లు అనుసరించడం మొదలుపెట్టాయి. అయితే ఇప్పటి వరకూ ఉచితంగా సెలబ్రిటీలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు, సంస్థలు వంటి అకౌంట్లను వెరిఫై చేసి బ్లూ టిక్ లు ఇచ్చిన ట్విట్టర్ ఇక నుంచి బ్లూ టిక్ కోసం ప్రతి నెలా డబ్బులు చెల్లించాలని షరతు పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. యూజర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ను సవరించేందుకు సిద్ధమైనట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
The whole verification process is being revamped right now
— Elon Musk (@elonmusk) October 30, 2022
వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం ఇప్పుడు పునరుద్ధరించబడుతోందని మస్క్ ట్వీట్ చేశారు. దీని గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. కానీ ట్విట్టర్ ఇక నుంచి అఫీషియల్ అకౌంట్లకి సంబంధించిన బ్లూ టిక్ కోసం ఛార్జీలను వసూలు చేయబోతుందన్న వార్తలు వస్తున్నాయి. బ్లూ టిక్ కోసం సెలబ్రిటీ యూజర్లు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేనని, లేదంటే బ్లూ టిక్ తొలగించబడుతుందని టెక్ వర్గాల సమాచారం. 4.99 డాలర్ల నుంచి 19.99 డాలర్లు నెల నెలా వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 411.16 నుంచి 1647.20 రూపాయలు. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సబ్స్క్రిప్షన్ పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తోంది ట్విట్టర్ సంస్థ. అమెరికాలో ప్రస్తుతం 5 డాలర్ల వరకూ వసూలు చేస్తోంది.
#BlueTick
You should be paying me for being on this platform @elonmusk…
You overpaid to buy Twitter without doing due diligence and now you want to charge me for having a blue tick?
Good luck with that!https://t.co/a5BAqDmx25— Ravi Mantha (@rmantha2) October 31, 2022
ఇప్పుడు మిగతా దేశాల్లో కూడా ఈ పద్ధతిని అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ట్విట్టర్ బ్లూ టిక్ ఛార్జెస్ ని పరిశీలిస్తుంది. ఇది గనుక ఓకే అయితే గనుక యూజర్లకు పెద్ద దెబ్బే అని అంటున్నారు. ఎందుకంటే ట్విట్టర్ ను చూసి మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లు కూడా వెరిఫికేషన్ ఛార్జెస్ వసూలు చేస్తే నెలకి 10 వేల పైనే బిల్ అవుతుందని కొంతమంది యూజర్లు మండిపడుతున్నారు. భారీ ధర వెచ్చించి ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు కాబట్టి ఆ రుణ భారాన్ని ఇలా యూజర్ల మీద వేసి వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని ఒక యూజర్ కామెంట్ చేశారు.
Your Blue Tick On Twitter May Soon Cost This Much Every Month https://t.co/peO5ZDHKe5 pic.twitter.com/yHpzXzUjmD
— NDTV (@ndtv) October 31, 2022
మరొక యూజర్ అయితే.. ‘అసలు ఈ ప్లాట్ ఫారంలో ఉన్నందుకు మీరే (ఎలాన్ మస్క్) నాకు చెల్లించాలి డబ్బు. మీరు శ్రద్ధ లేకుండా అధిక డబ్బు చెల్లించి ట్విట్టర్ ను కొనుగోలు చేశారు కాబట్టి. ఇప్పుడు మీరు బ్లూ టిక్ కలిగి ఉన్నందుకు నాకు ఛార్జీలు విధించాలనుకుంటున్నారా? అదృష్టంగా భావించండి అయితే’ అంటూ ట్వీట్ చేశారు. మరి బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎలాన్ మస్క్.. దీనిపై తుది నిర్ణయం ఏం చెబుతారో చూడాలి. కొంతమంది ఐతే ఇది రూమర్ అయి ఉండవచ్చునని కొట్టి పడేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది మస్క్ చెప్పాలి.