ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ కు ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చోటు కల్పిస్తూ ఆ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఈ పదవీకాలం 2024 వరకు కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ట్విట్టర్ సంస్థలో ఎలన్ మస్క్ 9.2 శాతం(73.5 మిలియన్) షేర్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 11 మంది సభ్యులున్న బోర్డులోకి ఎలన్ మస్క్ ను కూడా ఒకరిగా ఆహ్వానించారు. మస్క్ ప్రభావంతో మార్కెట్ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్ 6 శాతం మేర పెరిగింది. అయితే మస్క్ సభ్యుడిగా ఉన్నంతకాలం.. ఒంటరిగా లేదా, బృందంగానైనా 14.5 శాతానికి మించి షేర్లు కొనుగోలు చేసేందుకు వీలు లేదనే నింబధన పెట్టినట్లు తెలుస్తోంది. ఇటు మస్క్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ కావడంపై ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ కూడా స్పందించారు.
ఇదీ చదవండి: బంగారంలో రాగి,వెండి ఎందుకు కలుపుతారో తెలుసా?
‘ఎలన్ మస్క్ తో గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నాము. మస్క్ లాంటి వ్యక్తి మా బోర్డులో సభ్యుడిగా ఉండటం మాకు ఎంతో బలం చేకూర్తుచుంది. మస్క్ మంచి విమర్శకుడు కూడా’ అంటూ పరాగ్ అగర్వాల్ స్పందించారు. ట్విట్టర్ సంస్థ బోర్డు సభ్యుడి కావడంపై మస్క్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘పరాగ్, ట్విట్టర్ బోర్డుతో కలిసి పనిచేసేందుకు కుతూహలంగా ఉన్నాను. వచ్చే కొన్ని నెలల్లో ట్విట్టర్ లో కొన్ని మార్పులు రాబోతున్నాయి’ అంటూ మస్క్ కూడా స్పందించారు. ఎలన్ మస్క్ ట్విట్టర్ బోర్డు సంస్థ బోర్డులో సభ్యుడు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I’m excited to share that we’re appointing @elonmusk to our board! Through conversations with Elon in recent weeks, it became clear to us that he would bring great value to our Board.
— Parag Agrawal (@paraga) April 5, 2022
Looking forward to working with Parag & Twitter board to make significant improvements to Twitter in coming months!
— Elon Musk (@elonmusk) April 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.