పశువులు తినే గడ్డి చాలా ప్రధానమైంది. తినే గడ్డి బట్టే పశువుల పాల ఉత్పత్తి అనేది ఉంటుంది. మీకు తెలుసా.. పశువులు సమృద్ధిగా పాలు ఇవ్వాలంటే సూపర్ నేపియర్ గడ్డి బాగా ఉపయోగపడుతుందని. ఈ గడ్డి సాగు గనుక మీరు చేస్తే ఇక తిరుగుండదు. మార్కెట్లో ఈ గడ్డికి చాలా డిమాండ్ ఉంది.
బెర్సీమ్, సూపర్ నేపియర్ గ్రాస్ అనేవి మిగతా పశుగ్రాసాలతో పోలిస్తే చాలా ఉత్పాదకమైనవి. అలానే జంతువులకు, ముఖ్యంగా పాడి పశువులకు చాలా ఆరోగ్యకరమైనవి. ఈ సూపర్ నేపియర్ గ్రాస్ కి ఎలాంటి ఫంగల్ డిసీజ్ సోకదు. గొల్లభామలు వంటి పురుగులతో నాశనం చేయలేని పంట ఇది. ఇది ఒకసారి వేస్తే 5 ఏళ్ళ వరకూ దిగుబడినిస్తుంది. పచ్చ గడ్డి, ఎండు గడ్డి వంటి ఇతర మేతలు తిని పాలిచ్చే పాడి పశువులతో పోలిస్తే సూపర్ నేపియర్ గ్రాస్ తినే పశువులు ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తాయి. సాధారణ గడ్డితో పోలిస్తే 14 నుంచి 18 శాతం అధిక ప్రోటీన్లు ఈ సూపర్ నేపియర్ గ్రాస్ లో ఉంటాయి. దీని వల్ల పశువులు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ పాలను ఉత్పత్తి చేయగలుగుతాయి.
ఒక్కో గడ్డి మొక్క 8 నుంచి 10 అడుగుల ఎత్తు ఎదుగుతుంది. ఒక్కో మొక్క 6 నుంచి 10 కిలోల బరువు వరకూ ఎదుగుతుంది. ఇది నోడ్ లను కత్తిరించడం ద్వారా ఎదుగుతుంది. నోడ్ అంటే కాండం నుంచి ఆకు వచ్చే బొడిపె దగ్గర కత్తిరించడం. ఇలా చేస్తే ఈ సూపర్ నేపియర్ గడ్డి మొక్కలు పెరుగుతాయి. ఎకరానికి 10 వేల నుంచి 12 వేల కాండాలు పడతాయి. కంపోస్ట్ ఎరువు ఏడాదికి 10 క్వింటాళ్లు వేయాల్సి ఉంటుంది. నీరు ఏడాదికి 10 వేల లీటర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొదటి పంట 60 రోజుల్లో వస్తుంది. ఆ తర్వాత నుంచి మాత్రం 45 రోజులకొకసారి దిగుబడి వస్తుంటుంది. ఒక బ్యాచ్ కి 1000 క్వింటాళ్ల గడ్డి దిగుబడి వస్తుంది. ఏడాదికి 5 వేల నుంచి 8 వేల క్వింటాళ్ల గడ్డి పండుతుంది. అంటే ఏడాదికి 5 నుంచి 8 బ్యాచ్ లు తీయచ్చు. బ్యాచ్ రావడానికి 45 రోజులు పడుతుంది.
ఒక ఎకరానికి ఒక బ్యాచ్ 25 టన్నుల గడ్డి దిగుబడి వస్తుంది. ఏడాదికి 8 బ్యాచ్ లు తీస్తే 200 టన్నుల దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఒక టన్ను నేపియర్ గ్రాస్ ధర రూ. 5,000 నుంచి 5,500 ఉంది. టన్ను 5 వేల చొప్పున వేసుకున్నా 200 టన్నులకు 10 లక్షలు ఆదాయం వస్తుంది. ఇందులో ఏడాదికి కూలీలకు, సాగునీటికి, ఎరువులకు ఇతర ఖర్చులకు రూ. 40 వేలు మినహాయిస్తే రూ. 9 లక్షల 60 వేలు రాబడి వస్తుంది. అంటే నెలకు కనీసం రూ. 80 వేలు మిగులుతుంది. తక్కువలో తక్కువ నెలకు రూ. 30 వేలు అయినా మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు.
రైతుని రాజుని చేసే పంట ఇది. ఒకసారి వేస్తే ఐదేళ్ల నుంచి 8 ఏళ్ల వరకూ నిలబడుతుంది. ప్రస్తుతం ఈ సూపర్ నేపియర్ గడ్డికి బాగా డిమాండ్ ఉంది. పశువుల మేతకు ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. ఇది ఆన్ లైన్ లో దొరుకుతుంది. లేదా మీ సమీప వ్యవసాయ మార్కెట్లో దొరుకుతుంది. మరి మీకు తెలిసిన రైతులకు ఈ నేపియర్ గ్రాస్ పంట గురించి షేర్ చేయండి. అలానే రైతులకు లాభం తెచ్చిపెట్టే ఈ నేపియర్ గ్రాస్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.