దేశానికి వెన్నుముక రైతు. మన నోట్లోకి నాలుగు మెతుకులు వెళుతున్నాయంటే దానికి కారణం అన్నదాతే. దుక్కి దుక్కి, నీరు పోసి, నారు వేసి, పంట చేతికొచ్చేదాక అహర్నిశలు కంటికి నిద్రలేకుండా కష్టపడుతున్న రైతుకు చివరకు సున్నం మిగులుతుంది.
దేశానికి వెన్నుముక రైతు. మన నోట్లోకి నాలుగు మెతుకులు వెళుతున్నాయంటే దానికి కారణం అన్నదాతే. దుక్కి దున్ని, నీరు పోసి, నారు వేసి, పంట చేతికొచ్చేదాక అహర్నిశలు కంటికి నిద్రలేకుండా కష్టపడుతున్న రైతుకు చివరకు సున్నం మిగులుతుంది. అకాల వర్షాలు లేదా నీరు లేకపోవడం వల్ల రైతు పంట నష్టపోతున్నాడు. చివరకు చీడ, పీడల వల్ల పంట అనుకున్న స్థాయిలో దిగుమతి కావడం లేదు. అలాగే చేతికొచ్చిన పంటను.. మార్కెట్‌లో అమ్ముకునే సరికి దళారీల దందాతో మరింత మోసపోతున్నాడు. అయితే అటువంటి రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 2018లో లక్ష రుణ మాఫీ పథకాన్ని ప్రకటించింది. ఇప్పుడు దాన్ని అమలు చేసే ప్రణాళికలు చేపడుతుంది
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. 2018లో ఎన్నికల సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీ హామీని ఈ ఏడాది నెరవేర్చనుంది. కరోనా కారణంగా నాలుగేళ్లు రుణ మాఫీ చేయలేదు ప్రభుత్వం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు సిద్ధమైందని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. రైతు బంధు నిధులను రైతుల రుణ ఖాతాల్లో జమ చేయొద్దని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించినట్లు వెల్లడించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై సోమవారం జరిగిన సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు అధికారులు. ఇప్పటి వరకు 5,42,635 మంది రైతులకు చెందిన రూ.1207 కోట్ల రుణాలను మాఫీ చేశామని రఘునందర్ రావు పేర్కొన్నారు. మిగిలిన రుణమాఫీ కోసం 2023-24 బడ్జెట్‌లో రూ.6325 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకారం అన్ని బ్యాంకులు రైతుల అకౌంట్లను రెన్యువల్ చేసి రుణాలు ఇవ్వాలని కోరారు.