రైతులకు, నిరుద్యోగ యువకులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల వరకూ లోన్ ఇచ్చే పథకం గురించి మీకు తెలుసా? 50 శాతం నుంచి 100 శాతం వరకూ సబ్సిడీ కూడా ఇస్తుంది. అంటే మీరు సగం లోన్ కడితే చాలు. కొంతమందికైతే అస్సలు లోన్ చెల్లించాల్సిన పని లేదు.
వ్యాపారం చేయాలన్న ఆలోచనలో ఉన్నారా? సొంత ఊళ్ళో ఉంటూ వ్యాపారం చేసుకుని డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా? పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ కేంద్ర ప్రభుత్వ పథకం మీ కోసమే. రైతులు, నిరుద్యోగ యువకుల కోసం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రూ. 50 లక్షల వరకూ రుణాన్ని అందిస్తుంది. అంతేకాదు వ్యాపారాన్ని బట్టి రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ సబ్సిడీ కూడా ఇస్తుంది. అంటే లోన్ తీసుకున్నాక సగం కడితే చాలు. కొంతమందికి అయితే చేసే వ్యాపారాన్ని బట్టి పూర్తిగా లోన్ మాఫీ అవుతుంది. ఈ పథకం ఏంటి? ఎలా దరఖాస్తు చేయాలి? ఎలాంటి వ్యాపారానికి ఈ లోన్ ఇస్తారు? వంటి వివరాలు మీ కోసం.
భారత ప్రభుత్వం కింద పని చేసే పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ.. నేషనల్ డొమెస్టిక్ యానిమల్ ప్రోగ్రాం కింద ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద రూ. 50 లక్షల వరకూ సబ్సిడీ మీద రుణాన్ని అందజేస్తుంది. మాంసం, పాలు, గుడ్ల ఉత్పత్తిని పెంచేందుకు ఈ నేషనల్ డొమెస్టిక్ యానిమల్ ప్రోగ్రాంని ప్రవేశపెట్టడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 129 బిలియన్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. ఈ ఉత్పత్తిని మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫార్మ్స్ ని అభివృద్ధి చేసేందుకు 50 లక్షల వరకూ లోన్ ఇస్తుంది. 50 శాతం నుంచి వంద శాతం వరకూ సబ్సిడీ ఇస్తుంది. అంటే తీసుకున్న లోన్ మొత్తంలో సగం కడితే చాలు. వంద శాతం సబ్సిడీ వస్తే కనుక అసలు లోన్ చెల్లించాల్సిన పనే లేదు. ఈ పథకానికి ఎవరైనా వ్యక్తులు గానీ, స్వయం సహాయక సంఘాలు, పారిశ్రామికవేత్తలు, రైతు సహకార సంఘాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ సొసైటీ, జాయింట్ లయబిలిటీ గ్రూప్, సెక్షన్ 8 కింద వచ్చే కంపెనీలు లోన్ కి అప్లై చేసుకోవచ్చు. కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులను పెంచే వారికి ఈ పథకం వర్తిస్తుంది.