SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Post Office Saving Schemes And Its Benefits

మధ్యతరగతి ప్రజలకు కాసులు కురిపిస్తోన్న పోస్టాఫీస్ పథకాలు..!

ఏ అవసరం ఎప్పుడొస్తుందో.. ఏ కష్టం ఏ సమయంలో తలుపు తడుతుందో ఊహించలేం. ఒకేసారి లక్షల కావాల్సి రావచ్చు. అదే పరిస్థితే వస్తే.. ఇళ్లు గడవడానికే అహర్నిశలు కష్టపడుతోన్న మధ్యతరగతి ప్రజలకు అంతకు మించిన భారం మరొకటి ఉండదు. అప్పుడు మీకు సహాయపడేవి.. పొదుపు పథకాలే. సంపాదించేది నాలుగు రాళ్ళైనా.. అందులో ఎంతో కొంత కింది ఏదేని పథకంలో పొదుపు చేయండి..

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 16 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మధ్యతరగతి ప్రజలకు కాసులు కురిపిస్తోన్న పోస్టాఫీస్ పథకాలు..!

పోస్టాఫీస్ పథకాలు గురించి పట్టణాల్లో నివసించే వారి కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికే ఎక్కువ తెలుసు. కూలీ నాలీ చేసుకుంటూ వచ్చే నాలుగు రాళ్ళలో ఎంతో కొంత పోస్టాఫీస్ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. అది ఎంత మొత్తమా..? అన్నది సమస్య వారి కాదు. భవిష్యత్తులో ఏ అవసరం వస్తుందో.. ఆ సమయంలో నలుగురి వద్ద చేతులు చాచకుండా ఉండలన్నదే వారి తాపత్రయం. అలా అని పోస్టాఫీస్ పథకాలను ప్రయోజనాలు తక్కువ అని తీసిపారేయకండి. ప్రభుత్వ రంగ అందించే ప్రయోజనాల కంటే పోస్టాఫీస్ పథకాల్లోనే ప్రయోజనాలు ఎక్కువ. అందులోనూ.. రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి రాబడి రావాలంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి.

పోస్టాఫీస్ పొదుపు ఖాతా, రిక్కరింగ్ డిపాజిట్లు, టైం డిపాజిట్లు, నెలవారీ ఆదాయ పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం, సుకన్య సమృద్ధి యోజన.. ఇలా పలు పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం.. ఈ ఐదు పథకాలను వేరు వేరు ఉద్దేశ్యాలతో తీసుకొచ్చారు. వీటి వల్ల ప్రయోజనాలు బోలెడు. ఆ ప్రయోజనాలు తెలుసుకొని భవిష్యత్ కోసం పొదుపు చేస్తారన్న ఆలోచనతో ఈ వివరాలు మీకందిస్తున్నాం..

సుకన్య సమృద్ధి యోజన

ఆడపిల్లల తండ్రులు.. తమ కూతురి భవిష్యత్ పై/ పెళ్లిపై బెంగ పెట్టుకోకూడదన్న ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆడపిల్లల భవిష్యత్తే మీ ఆలోచన అయితే.. ఇంతకు మించిన పథకం మరొకటి లేదు. ఆడబిడ్డ జన్మించిన క్షణం నుంచి 10ఏళ్ల వయసు వచ్చేలోపు ఈ ఖాతా తెరవాల్సి ఉంటుంది. పదేళ్లు దాటితే సాధ్యపడదు. ఆడపిల్లకు 18 సంవత్సరాల వయసు వచ్చాక.. ఖాతా ఆమె ఆధీనంలోకి వస్తుంది. అప్పటివరకు తల్లిదండ్రులకు మాత్రమే అకౌంట్ పై అధికారం ఉంటుంది.

సుక‌న్య స‌మృద్ధి ఖాతా ఇన్వెస్ట్‌మెంట్‌ పీరియడ్ 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ కాలవ్యవధి 21 ఏళ్లు. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు. ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చాక కొంత మొత్తంలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బులు పొందొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.

కిసాన్ వికాస్ పత్ర

ఈ పథకాన్ని 1988లో ఇండియా పోస్ట్ ప్రవేశపెట్టింది. ఆనాటి నుంచి ప్రజల మనసు చూరగొంటోంది అంటే నమ్మండి. ఇందులో ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టిన 124 నెలల్లో(10 సంవత్సరాల 4 నెలలు) ఆ మొత్తం రెట్టింపవుతుంది. ఉదాహరణకు, మీరు ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. 124 నెలల తర్వాత రూ. 10 లక్షలు మీ చేతికి అందుతాయి. ఇందులో కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలు. ఆపై ఎంత మొత్తమైనా రూ.1000 గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. అంటే.. రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000.. ఇలా పొదుచేయాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది ప్రయోజనకరం. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్రపై సంవత్సరానికి 7.2 శాతం వడ్డీ లభిస్తోంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

ఈ పథకం మెచ్యూరిటీ పిరియడ్ 15 సంవత్సరాలు. ఈ ఖాతాను 10 ఏళ్ల లోపు పిల్లల పేరుపై కూడా తెరవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మనిహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం

60 ఏళ్లు పైబడిన వారి కోసం ఉద్దేశించిందే ఈ పథకం. అయితే, 55 ఏళ్లు పైబడిన 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న రిటైర్డ్ సివిల్ ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను స్వీకరించిన ఒక నెలలోపు పెట్టుబడి పెట్టాలనే షరతుకు లోబడిన వారు ఈ ఖాతాను తెరవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు. ప్రతి 3 నెలలకొకసారి వడ్డీ చెల్లిస్తారు. కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 8 శాతం వడ్డీ లభిస్తోంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం

ఈ పథకంలో చేరిన వారికి ఒక సర్టిఫికెట్ అందచేస్తారు. వీటిని మరొకరి పేరిట బదిలీ చేసుకునే వీలూ ఉంటుంది. ఈ పథకంలో చేరాలంటే కనిష్టంగా రూ.100లు పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠ పరిమితి లేదు. ఆదాయ పన్ను 80సీ ప్రకారం ఉద్యోగులు, వ్యాపారులకు ఇది మేలు చేకూర్చే పథకం. కావాలనుకుంటే.. ఐదేళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగించవచ్చు. నామినీ సౌకర్యం ఉంటుంది. ఎన్‌ఎస్‌సీ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత చేతికి దాదాపు రూ.21 లక్షలు మీ చేతికందుతాయి. ప్రస్తుతం ఈ పథకంపై 6.8 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ ప్రభుత్వ పథకాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • kisan vikas patra
  • National Savings Certificate
  • Post Office Saving Schemes
  • Public Provident Fund Scheme
  • Senior Citizens Savings Scheme
  • Sukanya Samriddhi Yojana
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సిగరెట్ తాగడం మానేస్తే చాలు.. రూ.8 లక్షలు మీ సొంతం!

సిగరెట్ తాగడం మానేస్తే చాలు.. రూ.8 లక్షలు మీ సొంతం!

  • కేవలం రోజుకు రూ.6 పొదుపు.. మీ పిల్లలను లక్షాధికారిని చేసే అవకాశం!

    కేవలం రోజుకు రూ.6 పొదుపు.. మీ పిల్లలను లక్షాధికారిని చేసే అవకాశం!

  • రోజూ రూ. 30 పొదుపు చేస్తే చాలు.. రూ. 5 లక్షలు వస్తాయి!

    రోజూ రూ. 30 పొదుపు చేస్తే చాలు.. రూ. 5 లక్షలు వస్తాయి!

  • రూ.333 పొదుపుతో పదేళ్లకే రూ.16 లక్షలు.. ఈ ప్రభుత్వ స్కీమ్ సూపర్!

    రూ.333 పొదుపుతో పదేళ్లకే రూ.16 లక్షలు.. ఈ ప్రభుత్వ స్కీమ్ సూపర్!

  • ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు శుభవార్త.. పాప పెళ్లి సమయానికి లక్షల్లో లాభం!

    ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు శుభవార్త.. పాప పెళ్లి సమయానికి లక్షల్లో లాభం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam