సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు చేసేస్తున్నారా..? అయితే ఒక్కసారి ఆలోచించండి. రేపొద్దున పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే ఏం చేస్తారు. అనారోగ్యం బాగోలేకనో.. ఇంటి అవసరాలో ఓ పది లక్షలు కావాల్సి వస్తే ఏం చేస్తారు. అందుకే అన్నీ డబ్బులు ఖర్చు చేయకుండా నాలుగు రాళ్లు ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయండి.
కష్టపడి వేలకు వేలు సంపాదించినా చేతిలో డబ్బు ఎక్కువ నిలవదు. అదంటూ.. ఇదంటూ లేని పోనీ దుబారా ఖర్చులతో అన్నీ అయిపోతూ ఉంటాయి. అదే సంపాదించిన దాంట్లో నాలుగు రాళ్లు వెనకేసుకుంటే.. భవిష్యత్తులో అక్కరకొస్తాయి. అలా పొదుపు చేయాలన్న ఆలోచన ఉన్న వారి కోసమే ఈ సమాచారం. మీరు పొదుపు చేయాలనుకుంటే పోస్టాఫీసు పొదుపు పథకాలు మంచిదని చెప్పవచ్చు. తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడి అందిస్తాయి. అందుకు ఈ స్కీమ్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇందులో రోజుకు రూ.333 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలోనే చేతికి రూ.16 లక్షలు మీ చేతికి అందుతాయి. ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పొదుపు చేయాలనే ఆలోచన ఉండాలే కానీ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఎన్నో పథకాలు పోస్టాఫీసులో అందుబాటులో ఉన్నాయి. అందులో పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఒకటి. వీటిల్లో మన స్తోమతకు తగినట్లుగా ఇన్వెస్ట్ చేస్తూ పోతే మెచ్యూరిటీ గడువు ముగిశాక మంచి రాబడి పొందవచ్చు. ప్రభుత్వ పథకం కనుక రిస్క్ తక్కువ. అలాగే బ్యాంకులతో పోలిస్తే వడ్డీ రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీంలో నెలకు రూ. 100, రూ.1000, రూ.5000, రూ.10000.. ఇలా ఎంత మొత్తంలో అయినా డిపాజిట్ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ ఉండదు.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ కాలవ్యవధి 5 ఏళ్లు. అంటే 60 నెలలు. కావాలనుకుంటే మెచ్యూరిటీ గడువు ముగిశాక మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీంపై 6.2 శాతం వడ్డీ అందుతోంది. ఎంత డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి ఎంత రాబడి మీ చేతికి అందుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వేళ మీరు నెలకు రూ.1,000 అంటే రోజుకు రూ.33 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మీకు మెచ్యూరిటీ సమయానికి మీకు రూ.70,431 అందుతాయి. మరో ఐదేళ్లు పెంచుకుంటే 10 ఏళ్లకు రూ.1.66 లక్షలు మీ చేతికి అందుతాయి.
ఈ స్కీంలో మీరు నెలకు రూ.5,000, అంటే రోజుకు రూ.166 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుందాం. అప్పుడు 5 ఏళ్ల మెచ్యూరిటీ గడువు ముగిశాక మీ డబ్బు రూ.3.52 లక్షలు అవుతుంది. ఆ మొత్తాన్ని మరో ఐదేళ్లు పొడిగించినట్లయితే 10 ఏళ్ళు గడిచాక రూ.8.32 లక్షలు మీ చేతికి అందుతాయి.
మీరు ఎక్కువ ఆదాయం పొందుతున్నట్లయితే పెట్టుబడి మొత్తాన్ని ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు మీరు రోజుకు రూ.333 ఇన్వెస్ట్ చేస్తే అంటే నెలకి రూ.10,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 5 ఏళ్ల తర్వాత మీ కార్పస్ మొత్తంరూ. 7.04 లక్షలు అవుతుంది. ఆ మొత్తాన్ని మరో ఐదేళ్లు పొడిగించినట్లయితే 10 ఏళ్ల సమయానికి మీ సొమ్ము మొత్తం వడ్డీతో కలిపి రూ.16.6 లక్షలు అందుతుంది. చూశారుగా.. పదేళ్లలో ఎంత పెద్ద మొత్తం మీ చేతికి అందుతుందో.. ఇల్లు కొనేందుకైనా, పిల్లల పైచదువులకైనా ఇలా పొదుపు చేస్తూ వెనకేసుకోవడం చాలా మంచిది. వెంటనే మీ పెట్టుబడిని ప్రారంభించండి.