మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా..? అయితే మీకో శుభవార్త. ఆడపిల్లలను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లపై కీలక ప్రకటన వచ్చేసింది. ఒకందుకు ఇది ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు శుభవార్త అనే చెప్పాలి.
సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేట్లు పెరిగాయి. గతంలో ఈ పథకం వడ్డీ రేట్లు 7.60 శాతంగా ఉండగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికంలో (ఏప్రిల్- జూన్ క్వార్టర్) ఈ స్కీం వడ్డీ రేట్లను కేంద్రం ఇటీవల 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ప్రస్తుతం ఈ పథకంపై 8 శాతం వడ్డీ లభిస్తోంది. దీంతో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి అధిక రాబడి అందనుంది. పదేళ్ల లోపు ఆడపిల్లలు మాత్రమే ఈ పతకంలో చేరేందుకు అర్హులు. ఒక కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలు ఈ పథకంలో చేరవచ్చు. ఒకవేళ రెండో కాన్పులో ఇద్దరి ఆడపిల్లలకు జన్మనిచ్చినట్లయితే.. అప్పుడు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఈ పథకంలో చేరవచ్చు.
ఈ పథకంలో ఏడాదికి కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. నెల నెల కొంత మొత్తం లేదా ఏడాదికోసారి ఏ పథకంలో మీ పొదుపు మొత్తాన్ని చెల్లించవచ్చు. ఇలా 15 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. సదరు ఖాతాదారుకు 18 ఏళ్ల వయసు వచ్చాక.. మెచ్యూర్డ్ అమౌంట్‌లో సగం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అనంతరం 21 ఏళ్లకు మొత్తం మీ చేతికి అందుతుంది. ఏదేని ఆథరైజ్డ్ బ్యాంకులు లేదా పోస్టాఫీస్ లలో రూ.250 ప్రవేశ రుసుముతో ఈ ఖాతాను తెరవచ్చు. కావాలంటే దేశంలో ఎక్కడికైనా ఉచితంగా ఆ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు/సంరక్షకులు ఎవరైనా ఈ ఖాతాను అమ్మాయి పేరు మీద తెరవచ్చు. బాలిక ఫొటో, తల్లిదండ్రులు/సంరక్షకుల ఫొటో, ఆధార్, బర్త్ సర్టిఫికేట్ వివరాలు సమర్పించాలి.
ఈ పథకంలో నెలకు రూ.5 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ గడువు ముగిశాక మీ చేతికి రూ.25 లక్షలొస్తాయి. అదే నెలకు ఇక్కడ రూ.12500 లేదా ఏడాదికి రూ.1.50 లక్షల విధానాన్ని ఎంచుకుంటే.. 21 ఏళ్ల తరువాత రూ.64 లక్షలు మీ చేతికొస్తాయి. అలాగే ఈ మొత్తం పూర్తిగా టాక్స్ ఫ్రీ. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80 (C) కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ పథకం వడ్డీ రేట్లపై ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష ఉంటుంది. ఈ స్కీమ్ కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే గమనించగలరు. ఈ పథకాన్ని ఇంకా ఎవరైనా తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవడం ఉత్తమం. ఈ పతాకంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.