మీ పిల్లల భవిష్యత్ గురుంచే మీ ఆలోచనా..! అయితే ఈ కథనం మీరు తప్పక చదవవాల్సిందే. ఈ పథకంలో మీ పిల్లల పేరుపై రోజుకు రూ.6 ఇన్వెస్ట్ చేస్తూ పోతే.. మెచ్యూరిటీ గడువు ముగిశాక లక్ష రూపాయలు మీ చేతికి అందుతాయి.
మీ పిల్లల పేరుపై ఎంత కొంత పొదుపు చేయాలనీ ఆలోచిస్తున్నారా! అయితే ఈ పథకాన్ని ఓసారి పరిశీలించండి. ఈ పథకంలో రోజుకు రూ. 6పొదుపు చేస్తూ లక్ష రాబడిని పొందవచ్చు. ఎలా..? ఈ పథకం ఏంటి..? ప్రయోజాలేంటి..? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. జీవిత బీమా పథకమంటే వయసు పైబడిన వారికి ప్రయోజకరం అన్నది ప్రజలలో ఉన్న భావన. అది వాస్తవం కాదు. చిన్నారుల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ‘బాల్ జీవన్ బీమా’ ఒకటి. ఈ పథకంలో రోజుకు రూ. 6 పొదుపు చేస్తూ పోతే మెచ్యూరిటీ సమయంలో రూ.లక్ష రాబడి మీ చేతికి అందుతుంది.
పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఖర్చులు అధికమవుతుంటాయి. వారి చదువుల కోసం లక్షలు చెల్లించాలి వస్తే వారి పుస్తకాలు, యూనిఫార్మ్ వంటి వాటి కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో వారి భవిష్యత్తుకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, ముందస్తు ప్రణాళిక అవసరం. పిల్లలు పుట్టిన నాటి నుంచే వారి కోసం ఎంత కొంత పొదుపు చేస్తూ ఉండాలి. అవి వారి భవిష్యత్తుకు భరోసానిస్తాయి. పెద్ద మొత్తంలో పొదుపుచేయలేకపోయిన, రోజుకు రూ.6 అన్నది అందరకీ సాధ్యమయ్యే పనే.
‘బాల్ జీవన్ బీమా’ పథకంలో కనిష్టంగా రోజుకు రూ. 6, గరిష్టంగా రూ.18 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల పేరుపై తల్లిదండ్రులు పొదుపు ప్రర్మభించాల్సి ఉంటుంది. 45 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులు తమ పిల్లల పేరుతో ఈ పథకంలో పొదుపు ప్రారంభించవచ్చు. 5 నుంచి 20 ఏళ్లలోపు పిల్లలు ఈ పథకంలో చేరవచ్చు. ఒక కుటుంబంలోని ఇద్దరు పిల్లలు ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. పెద్ద మొత్తంలో పొదుపు చేయాలనే వారు కనీసం రోజుకు రూ.6 పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీపై రూ. ఒక లక్ష వరకు రాబడి పొందవచ్చు. ఒకవేళ పాలసీ కాలవ్యవధిలో పాలసీదారు మరణిస్తే.. ఆ తరువాత పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిసిన తర్వాత, పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం ఇస్తారు.