ఇండియన్ మార్కెట్ విషయంలో టెస్లాకి.. పోర్షే గట్టి షాకే ఇచ్చింది. భారత మార్కెట్‌లోకి వస్తాం.. వస్తాం.. అంటూ నాన్చుతున్న టెస్లాకు పోటీగా పోర్షే అడుగుపెట్టింది. చడీచప్పుడు కాకుండా ఇండియన్ మార్కెట్‌లోకి లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ కారు టేక్యాన్ పోర్షేను ప్రవేశపెట్టింది. రాయితీల కోసం ఎదురుచూస్తూ టెస్లా నాన్చుడు వ్యవహారాన్ని అవలంబిస్తోంది. ఇప్పుడు పోర్షే చేసిన పని టెస్లాను కంగుతినేలా చేసింది.
It can produce up to 408 hp. It perfectly combines high performance with a range of up to 484 km. It recharges the battery up to 80% in just 22.5 minutes. It can only be a Porsche. The new all-electric Taycan.
Coming soon.#PorscheIndia #Taycan #SoulElectrified pic.twitter.com/tAfI6WV6ug— Porsche India (@Porsche_India) November 9, 2021
ఇండియాలో ఈ కారు ప్రారంభం ధర రూ.1.50 కోట్లుగా నిర్ణయించారు. టేక్యాన్ పోర్షే స్పోర్ట్స్ లగ్జరీ కారని.. ఇది జెట్ స్పీడుతో దూసుకెళ్తుందని వెల్లడించింది. కేవలం 2.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ప్రకటించింది. దీని గరిష్ట వేగం 240 కిలోమీటర్లని తెలిపింది. ఈ మోడల్‌లో బేసిన్ వర్షన్ కారు 408 హెచ్‌పీతో వస్తండగా.. హైఎండ్ కారు 761 హెచ్‌పీ కలిగి ఉంటుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 484 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని పోర్షే చెబుతోంది.
The new @porsche #Taycan makes a stealthy entrance at Rs 1.5 crore a piece #SoulElectrified pic.twitter.com/iyuC4T8349
— Parth Charan (@ParthCharan) November 12, 2021
టెస్లా ఇటీవల ఎస్ ప్లెయిడ్ మోడల్‌ని గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. వాటికి మంచి ఆదరణ లభించింది. ఆ సందర్భంగానే ఇండియాకి కూడా టెస్లా తెస్తామంటూ ఎలన్ మస్క్ ప్రకటించాడు. కానీ ఒక చిన్న మెలిక పెట్టాడు. పర్యావరణహితమైన కార్లు కాబట్టి.. మాకు ఇంపోర్ట్ టాక్స్ తగ్గించాలని కోరాడు. అందుకు స్పందించిన కేంద్రం.. ఇండియాలో తయారీ కేంద్రం పెడితే అలాగే దిగుమతి సుంకం గురించి ఆలోచిస్తామని వెల్లడించింది. అలా అలా ఆ విషయంలో టెస్లా, ఎలన్ మస్క్ జాప్యం చేస్తూ వచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా పోర్షే ఇండియా మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ కారుతో అడుగుపెట్టేసింది.
The Porsche Taycan has been launched in India! Available in four variants, the price starts from Rs 1.50 crore.
⚡️ 484km range (WLTP cycle)
⚡️ Up to 761PS
⚡️ Can be had either with a 79.2kWh or 93.4kWh battery pack pic.twitter.com/a1QUuNQqr8— PowerDrift (@PowerDrift) November 12, 2021