దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. ఈ పథకానికి సంబంధించిన 14వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు కూడా ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ స్కీం ప్రవేశపెట్టింది. మన ప్రధాన మంత్రి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను చేరే విధంగా అమలు పరుస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అన్నదాతల అకౌంట్లలో చేరనున్నాయి. ఈ పథకానికి సంబంధించిన 14వ విడత కింద మొత్తం రూ. 8.5 కోట్ల మంది రైతులకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో పీఎం కిసాన్ పథకం ప్రారంభించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించిన 14వ విడత డబ్బులు ఈ రోజు విడుదల చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజస్తాన్‌లోని సికార్‌లో ఓ కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ డబ్బులు పొందాలనుకునే అన్నదాతలు EKYC తప్పనిసరిగా చేయించాలి. రైతులు తమ భూమి పత్రాలను ధృవీకరించాలి. అన్నదాతలు వారి బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ జత చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌ను NPCIకి లింక్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్ చేసుకున్న రైతులకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లోకి చేరుతాయి.
14వ విడత డబ్బులు పొందే రైతులకు రూ. 2000 వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఏ కారణం చేతనైనా 13వ విడతలో డబ్బులు పొందని రైతులకు కూడా ఈసారి 13, 14 రెండు విడతల డబ్బులు కలిపి రూ. 4000 జమ చేయనున్నారు. అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6000 చొప్పున అందించబడుతాయి. మూడు విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికి 13 వాయిదాలు జమ అయ్యాయి. ఇప్పుడు 14వ విడత డబ్బులు విడుదల చేస్తారు. అర్హులు pmkisamn.gov.in వెబ్ సైట్ లేదా తమ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోవచ్చు.