సహారా చిట్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నష్టపోయిన వారికి డబ్బులు రిఫండ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. మరి ఈ డబ్బును పొందడం కోసం ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు మీ కోసం.
దేశంలోని అతి పెద్ద కార్పొరేట్ స్కామ్స్ లో ఒకటి ఈ సహారా స్కామ్ లేదా సహారా చిట్ ఫండ్ స్కామ్. సహారా స్కామ్ అప్పట్లో ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో సహారా ఛైర్మన్ సుబ్రతా రాయ్ పేదల డబ్బుతో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుని మోసం చేశాడు. మార్చి 29న ఈ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెబీ ఆదేశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే అప్పట్లో పెట్టుబడులు పెట్టిన వారికి శుభవార్త చెప్పింది. సహారా కంపెనీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులకు డబ్బును రిఫండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసం సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ సహారా రిఫండ్ పోర్టల్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రారంభించారు.
ఈ పోర్టల్ లో నమోదు చేసుకున్న 45 రోజులకు డబ్బులు వాపసు అవుతాయి. అయితే ముందు ఈ అవకాశాన్ని 10 వేల వరకూ డిపాజిట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన వారికి చేస్తామని అన్నారు. 10 వేల వరకూ ఇన్వెస్ట్ చేసిన వారి కోసం 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే 2022 మార్చి 22 లోపు సహారా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహరాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రికెట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన డిపాజిటర్లు మాత్రమే ఈ రిఫండ్ కి అర్హులను కేంద్రం తెలిపింది. ఈ డబ్బును రిఫండ్ పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ లోకి వెళ్ళాలి.