2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మీ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 4 నెలల వ్యవధిని కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 30 వరకు మీరు రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అయితే చాలా మంది రూ.2 వేల నోట్లను మార్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటన్నారు.
రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నిజానికి గత కొన్నేళ్లుగా 2 వేల రూపాయల నోట్ల ముద్రణ తగ్గిస్తూ.. చలామణీ మందగించేలా చేశారు. అయితే చాలా కొద్ది మంది వద్ద మాత్రమే ఈ రూ.2 వేల నోట్లు ఉండే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సమయంలో వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేశారు. మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లో మీ వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. మీరు రూ.50 వేలకు మించి రూ.2 వేల నోట్లు మార్పిడి చేయాలి అంటే అందుకు పాన్ కార్డుని తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రూ.2 వేల నోటు మార్చేందుకు ఆర్బీఐ చెప్పినట్లు కాకుండా.. చాలా మంది వారి సొంత దారులను వెతుక్కుంటున్నారు.
నిజానికి ఇలాగే రూ.2 వేల నోటు మార్చుకోవాలని ఆర్బీఐ, బ్యాంకులు చెబుతున్నాయి. కానీ, ప్రజలు మాత్రం వారి వారి సొంత ప్రయత్నాలను, మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎప్పుడైతే ఆర్బీఐ ప్రకటన జారీ చేసిందో.. అప్పటి నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగాయంటూ వార్తలు వస్తున్నాయి. తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లతో క్యూలో నిల్చుని మార్చుకోవాల్సిన అవసరం ఏముంది అనుకున్నారో? లేక బంగారం మీద పెట్టుబడి పెట్టేందుకు ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారో గానీ.. నిన్న మొన్న వరకు ధర ఎక్కువుందని బంగారం జోలికి పోని వాళ్లంతా ఇప్పుడు ఎగబడి బంగారం కొనేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకో విధంగా కూడా రూ.2 వేల నోట్లు మార్చుకోవచ్చని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
kids: exchange ₹2000 note at bank
adults: order cash on delivery and give ₹2000 note
legends: never had ₹2000 note— zomato (@zomato) May 19, 2023
మరీ ఎక్కువ మొత్తంలో రూ.2 వేల నోట్లు ఉంటే బంగారం అవీ కొనేయచ్చు. మరీ ఒకటి రెండూ ఉన్నాయనుకోండి ఏం చేయాలి? వాటికోసం కూడా క్యూలో నిల్చోవాల్సిందే. కానీ, ఈ ఐడియా మీరు ఫాలో అయితే ఆ అవసరం ఉండదని చెబుతున్నారు. అదేంటంటే.. జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకుని ఫుడ్ ఆర్డర్ చేయడం. వచ్చిన తర్వాత ఎంచక్కా రూ.2 వేల నోటు ఇచ్చేయడం. అయితే ఈ విషయాన్ని స్వయంగా జొమాటోనే వెల్లడించింది. ఆర్బీఐ నిర్ణయం తర్వాత వారి క్యాష్ ఆన్ డెలివరీలో 72 శాతం మంది కస్టమర్లు రూ.2 వేల నోటునే ఇచ్చారంట. ఆ విషయం తెలుసుకున్న తర్వాత.. చాలా మంది మంచి ఐడియా ఇచ్చారు. మీ గురించే మర్చిపోయాం అసలు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే క్యూలో నిల్చొని రూ.2 వేలు నోటు మార్చడం కంటే ఇదేదో మంచి ఐడియాలా ఉందే అని చంకలు గుద్దేసుకుంటున్నారు. మరి.. జొమాటోలో రూ.2 వేల నోట్లు మార్చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
since friday, 72% of our cash on delivery orders were paid in ₹2000 notes pic.twitter.com/jO6a4F2iI7
— zomato (@zomato) May 22, 2023