ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తన యూజర్ల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. పేటీఎం యాప్ నుంచి ఎల్పీజీ సిలిండర్స్ బుక్ చేసుకునే యూజర్ల కోసం అద్భుతమైన డీల్స్ (ప్రొమోకోడ్స్)తో ముందుకొచ్చింది. పేటీఎం యాప్‌ను ఉపయోగించి గ్యాస్ బుక్‌చేసే సమయంలో ఈ ప్రొమోకోడ్స్ను అప్లై చేయడంతో క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తించనుంది.
ఎల్బీజీ వినియోగదారులకోసం పేటీఎం మూడు సరికొత్త ప్రొమోకోడ్స్ను తీసుకొచ్చింది. పేటీఎం యాప్‌ను ఉపయోగించి గ్యాస్ బుక్‌చేసే సమయంలో ఈ ప్రొమోకోడ్స్ను అప్లై చేయడంతో క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చును. మొదటి ప్రొమో కోడ్(BANKBANG)లో భాగంగా పేటీఎం యూజర్లు రూ. 25 డిస్కౌంట్‌ను పొందవచ్చును. ఈ ఆఫర్ కేవలం డెబిట్ కార్డుతో చెల్లింపు జరిపినప్పుడే డిస్కౌంట్ వస్తోంది. రెండో ప్రోమో కోడ్(FIRSTCYLINDER)తో రూ.30 పేటీఎం క్యాష్‌బ్యాక్ యూజర్లకు రానుంది. మూడో ప్రొమో కోడ్‌లో భాగంగా ఉచితంగానే సిలిండర్‌ను పొందవచ్చును.
ఉచితంగా సిలిండర్ పొందే అవకాశం
ఎల్పీజీ సిలిండర్ ను ఉచితంగా పొందాలనుకుంటే, యూజర్లు బుకింగ్ సమయంలో FREECYLINDER అనే ప్రోమోకోడ్‌ను వాడాలి. అయితే సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో పూర్తి మొత్తాన్ని యూజర్లు చెల్లించాలి. ఈ ప్రోమోకొడ్తో చెల్లించిన మొత్తాన్ని పేటీఎం క్యాష్‌బ్యాక్ రూపంలో పూర్తిగా అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ప్రతి 100 వ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి వర్తించనుంది. గరిష్టంగా వెయ్యి రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు పొందవచ్చు. ఫిబ్రవరి 28, 2022 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు 100వ లక్కీ కస్టమర్ అయితే.. 24 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
పేటీఎం నుంచి గ్యాస్ బుక్ చేయండి ఇలా..!