ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ టీమ్ బంపరాఫర్ ప్రకటించింది. ఆ వివరలు..
భారీ బడ్జెట్ చిత్రాలకు కెరాఫ్ అడ్రెస్‌గా మారాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నవన్ని పాన్ ఇండియా చిత్రాలే. ఇవన్ని వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తోన్న చిత్రాల జాబితాలో ఆదిపురుష్ ముందు వరుసలో ఉంటుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. కృతి సనన్.. సీత పాత్రలో నటిస్తోంది. హనుమంతుడి కోణంలో రామయణాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నాడు. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకుడు. ఇక తాజాగా విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్.. చిత్రం మీద భారీ అంచనాలు పెంచేసేంది. సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఆదిపురుష్ టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు, సినిమా లవర్స్‌కు బంపరాఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
ఆదిపురుష్ టీమ్.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఒక టికెట్ కొంటే మరొకంటి ఉచితం అని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పేటీఎం ద్వారా టికెట్లు బుక్ చేస్తే.. ఈ ఫ్రీ ఆఫర్ సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది. పైగా ఈ ఆఫర్ జూన్ 30 వరకు మాత్రమే అని చెప్పింది. మరి ఈ ఆఫర్ ఎలా పొందాలి అంటే..
ముందుగా పేటీఎంలో 100 రూపాయలు చెల్లిస్తే.. ప్రొమో కోడ్ వస్తుంది. ఆదిపురుష్ టికెక్ బుక్ చేసుకునే ముందు ఆ ప్రొమో కోడ్‌ను అప్లై చేస్తే.. 400 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంటే ఆదిపురుష్ సినిమా టికెట్లు రెండు బుక్ చేస్తే.. ట్యాక్స్‌తో కలిపి 700 రూపాయల పైనే అవుతుంది. అదే పేటీఎం ఆఫర్ కోడ్‌ను వినియోగిస్తే సగానికి తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్ కేవలం 350 రూపాయల కనీస ధర ఉన్న టికెట్ మీద మాత్రమే వర్తిస్తుందని టీ సిరీస్.. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇక జూన్ 16న ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదలకు ముందే ఆదిపురుష్.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రదర్శించేందుకు ఎన్నికయ్యింది. న్యూయార్క్ వేదికగా.. జూన్ 7-18 వరకు ఈ జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఆదిపురుష్ సినిమాను జూన్ 13న ప్రదర్శించనున్నారు. ఇక తాజాగా విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. విజువల్ వండర్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక టీసిరీస్ ప్రకటించిన ఆఫర్ పట్ల ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆదిపురుష్ ట్రైలర్ మీకు నచ్చిందా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Get ready to experience the epic saga with this epic offer! Book 2 movie tickets for the price of 1!
Book now: https://t.co/jDLqWg5G5O @PaytmTickets#Adipurush IN CINEMAS ON JUNE 16! Jai Shri Ram 🙏#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar… pic.twitter.com/wwNhirjPsJ— T-Series (@TSeries) May 10, 2023