అత్యవసరంగా రైలు ప్రయాణం చేయాలా..? మీ వద్ద టిక్కెట్ కు సరిపడా డబ్బులు లేవా! అయినా బెంగ అక్కర్లేదు. ప్రయాణీకులకు మరింత సులభతరమైన సేవలను అందించేందుకుగాను ఐఆర్‌సీటీసీ సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.
రైలు ప్రయాణం ఎంత సురక్షితమైనదో అందరకీ విదితమే. దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది ప్రజలు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. కారు, బస్సు ప్రయాణాలతో పోలిస్తే రైలు ప్రయాణం సురక్షితమైనదే కాదు, ఎంతో సౌకర్యవంతమైనది కూడాను. పిల్లాపాపలతో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకుంటే,, ట్రైన్ జర్నీ మంచి ఎంపిక. అయితే కొన్ని సందర్భాల్లో ట్రైన్ టిక్కెట్ బుక్ చేసుకోవడానికి సరిపడా డబ్బు లేక.. చాలా అవస్థలు పడతుంటాం..! ఆర్థిక సహాయం కోసం అందరినీ అడుగుతుంటాం.. ఇకపై ఆ బెంగ అక్కర్లేదు. ప్రయాణీకులకు మరింత సులభతరమైన సేవలను అందించేందుకుగాను ఐఆర్‌సీటీసీ సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుతం ఈ-కామర్స్ వేదికలు అందిస్తోన్న ‘బై నౌ పే లేటర్’ సదుపాయాన్ని ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రయాణికులు మొదట డబ్బులు లేకపోయినా టికెట్ బుక్ చేసుకొని ప్రయాణం చేయవచ్చు.. తరువాత ఆ డబ్బులను చెల్లించవచ్చు. అందుకోసం ఐఆర్‌సీటీసీ వివిధ వేదికలైన పేటీఎం, ఈపేలేటర్‌తో చేతులు కలిపింది. ఈ-కామర్స్ వేదికలపై వస్తువును కొని ఈఎంఐ పద్ధతిలో ఎలాగైతే చెల్లింపులు చేస్తున్నామో.. ఇకపై ట్రైన్ టికెట్లూ అదే మాదిరిగా కొనుగోలు చేయొచ్చు. ఇంకా కావాలంటే ఆ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు. 3 నుంచి 8 వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పేటీఎంస్ సంస్థ తమ యూజర్ల కోసం పోస్ట్‌పెయిడ్ సర్వీసులను ఇప్పటికే అందాలుబాటులోకి తెచ్చింది. రూ.60,000 మొత్తాన్ని 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణంగా ఇస్తోంది. బిల్లింగ్ సైకిల్ ముగిసేలోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. కావాలంటే వాడుకున్న మొత్తాన్ని వాయిదా పద్ధతిలో కూడా మార్చుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని ఐఆర్‌సీటీసీ లో ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈపేలేటర్ అనే ఫిన్‌టెక్ సంస్థ సైతం ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, 14 రోజుల్లోగా టికెట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..
క్యాష్‌ఈ యాప్ ద్వారా..